NTV Telugu Site icon

బెంగాల్ త‌ర‌హాలో తెలంగాణ‌పై బీజేపీ ఫోక‌స్‌..!

Shiv Prakash

తెలంగాణ‌పై క్ర‌మంగా ఫోక‌స్ పెంచుతోంది భార‌తీయ జ‌నతా పార్టీ.. వ‌రుస‌గా కేంద్ర నాయ‌క‌త్వం రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తూ.. రాష్ట్ర నాయ‌క‌త్వాన్ని అల‌ర్ట్ చేస్తోంది.. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్ త‌ర‌హాలోనే తెలంగాణ‌పై కూడా దృష్టి పెట్ట‌బోతున్నాం అని తెఇపారు ఆ పార్టీ నేత శివ ప్ర‌కాష్‌… హైద‌రాబాద్‌లో బీజేపీ ముఖ్య నేత‌ల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్ల‌లో పార్టీని బలోపేతం చేయాలి.. రాష్ట్ర నాయ‌కుల‌తో ఒక్కొక్కరితో వ్య‌క్తిగ‌తంగా మాట్లాడుతా… మీ మనసులో మాట అప్పుడు చెప్పండి అని సూచించారు.. మీరు చెప్పిన అంశాల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తాన‌న్న శివ ప్ర‌కాష్‌… సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

కేసీఆర్ పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేకత ఉంద‌న్నారు శివ ప్ర‌కాష్‌.. ఛాలెంజింగ్‌గా తెలంగాణ‌కు రాబోతున్నాం.. ప‌శ్చిమ బెంగాల్ త‌ర‌హాలోనే ఇక్క‌డ దృష్టి పెట్ట‌బోతున్నామ‌న్న ఆయ‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుపైనే అంద‌రి దృష్టి ఉండాల‌ని సూచించారు.. కేసీఆర్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాటం చేయాల‌న్న ఆయ‌న‌.. వీధి పోరాటాలకు సన్నద్ధం కావాల‌న్నారు.. కింది స్థాయి నుండి పార్టీలో చేరికలు ఉండాలి.. ఇతర పార్టీలలో అసంతృప్తుల‌ను పార్టీలోకి తీసుకోవాల‌న్నారు. అయితే, డబ్బుల మీద ఆధారపడి కేసీఆర్ గెలుస్తున్నాడని శివ ప్ర‌కాశ్ దృష్టికి తీసుకెళ్లారు నేత‌లు.. డబ్బుల పంపిణీ కంట్రోల్ చేయాల‌ని తెలిపారు.

Show comments