Site icon NTV Telugu

హుజురాబాద్‌ ఉప ఎన్నిక వస్తుందనే 50 వేల ఉద్యోగాలు..!

Soyam Bapu Rao

Soyam Bapu Rao

తెలంగాణలో త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. కొత్త జోన్లు, కొత్త జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీ, ఖాళీల గుర్తింపు తదితర అంశాలపై కసరత్తు సాగుతోంది.. అయితే, హుజురాబాద్‌ ఉప ఎన్నిక వస్తుందనే 50 వేల ఉద్యోగాలు అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు… ప్రతి ఎలక్షన్ సమయంలో 50 వేల ఉద్యోగలు ఇస్తానని సీఎం ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించిన ఆయన.. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు గుర్తుకు వస్తున్నాయి.. ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్ వస్తున్నాయనే 50 వేల ఉద్యోగాలు అంటున్నారని మండిపడ్డారు.. ఇక, కోనప్పకు ధైర్యం ఉంటే పోడుభూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడాలంటూ సవాల్ విసిరారు ఎంపీ సోయం బాపురావు.. పోడు భూముల విషయంలో అదివాసులకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version