NTV Telugu Site icon

BJP MP K. Laxman: రేవంత్ రెడ్డి రాజీపడ్డారు కాబట్టే.. కాళేశ్వరం ఫైల్ లను తొక్కి పెట్టారు..

Mp Lakxman

Mp Lakxman

BJP MP K. Laxman: సీఎం రేవంత్ రెడ్డి రాజీపడ్డారు కాబట్టే.. కాళేశ్వరం ఫైల్ లను తొక్కి పెట్టారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ రిజర్వేషన్ లు కొనసాగాలని స్పష్టంగా చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? అని ప్రశ్నించారు. అబద్దాలనే ప్రచార అస్ట్రాలుగా మార్చుకున్నారని మండిపడ్డారు. ప్రజలు నమ్మక పోవడం తో ఫేక్ వీడియో లు చేశారన్నారు. తెలంగాణ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీతో సహా పార్టీ నేతలందరూ రాజ్యాంగం ను పరిరక్షిస్తామని చెబుతున్నారని తెలిపారు. రేవంత్ మీరు కాంగ్రెస్ కు కొత్త కావొచ్చు… ఆ పార్టీ రాజ్యాంగాన్ని మొదటి నుండి అవమానిచిందన్నారు. మతపరమైన విభజనకు కారణం నెహ్రూ అన్నారు. ఈ రోజు సెక్యులరిజం గురుంచి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే అని తెలిపారు.
రాజ్యాంగాన్ని ఇందిరాగాంధి అవమానించినట్టు ఎవరు అవమానించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: BSNL Installation Charges: బీఎస్‌ఎన్‌ఎల్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఎలాంటి ఛార్జీలు లేవు!

రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ లు అబద్దాలనే నమ్ముకున్నారని అన్నారు. చైనా లాంటి దేశ సహకారం తో మార్ఫింగ్ జరిగిందా? అని ప్రశ్నించారు. రేవంత్, కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నట్టు బయట పడుతుందన్నారు. మతపరమైన రిజర్వేషన్ లకు తావు లేదని అంబేద్కర్ చెబితే … తూట్లు పొడించింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీసీ లకి 50 డివిజన్ లు కేటాయిస్తే అందులో 31 మంది ముస్లిం లు గెలిచారు… బీసీ లకు అన్యాయం జరిగిందన్నారు. రాజీపడ్డారు కాబట్టే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ఫైల్ లను తొక్కి పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. నోటుకు ఓటు కేసు ముందుకు పోదన్నారు. ఒక్క మాదిగకు సీటు ఇవ్వకుండా మీరు ఏ విధమైన సమాజిక న్యాయం పాటించారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని చైనా కు తాకట్టు పెట్టార, ఇటలీ కి తాకట్టు పెట్టార తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.
Posani Krishna Murali: జగన్‌ను చంపేందుకు కుట్ర..! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తా..

Show comments