NTV Telugu Site icon

K Laxman: మహిళల పట్ల ఎమ్మెల్సీ కవిత మొసలికన్నీరు కార్చుతున్నారు

K Laxman On Kavitha

K Laxman On Kavitha

BJP MP K Laxman Fires On MLC Kavitha: మహిళల పట్ల ఎమ్మెల్సీ కవిత మొసలికన్నీరు కార్చుతున్నారంటూ ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా బండి సంజయ్ చేపట్టిన దీక్షలో కే లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబానికి నచ్చితే మెచ్చుకుంటారు లేదంటే అణచివేస్తారని, ఇది తెలంగాణ సమాజానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోపించారు. డాక్టర్ స్థాయికి ఎదిగిన గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతిని హింసించడం వల్లే ప్రాణాలు పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. ప్రీతి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదని మండిపడ్డారు.

Bandi Sanjay: బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. యూపీ తరహా విధానం తెస్తాం

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ధర్నా చేస్తారంటున్నారని, ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న కవిత ఏరోజూ మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదని కే లక్ష్మణ్ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లపై ముందు మీ పార్టీలో చర్చించాలన్నారు. మహిళా సంక్షేమంపై బీజేపీకా నీతులు చెప్పేది? అని ప్రశ్నించారు. గిరిజన ఆదివాసీ మహిళను తాము రాష్ట్రపతి చేశామని, కానీ అడవి బిడ్డను రాష్ట్రపతిగా ఓడించడానికి కేసీఆర్ కుట్రలు చేశారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు నదులను ఏమో కానీ.. మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. మద్యం కుంభకోణంలో మహిళలు ఏంటి? సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 4200 కోట్లు బకాయిలు పడిందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా డబుల్ ఇంపాక్ట్ ఉంటుందని.. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు.

Preethi Case: కేసు విషయంలో అన్యాయం జరుగుతోంది.. ప్రీతి కుటుంబం

అంతకుముందు.. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని కే లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ద్వారా ఏటా రూ.6 వేల కోట్ల ఆదాయం ఉండగా, ఇప్పుడు రూ.45 వేల కోట్లకు చేరిందని అన్నారు. గ్రామాల్లో బెల్టు దుకాణాల వల్ల అనర్థాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. యువత అనారోగ్యానికి గురై మృతి చెందుతుంటే, మహిళలు చిన్న వయసులోనే వితంతువులుగా మారుతున్నారని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. బీఆర్ఎస్ పాలన కారణంగా ఆగమైందని విమర్శించారు. ‘సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌’ నినాదంతో.. దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని వెల్లడించారు.

Nawazuddin Siddiqui: మాజీ భార్య ఆరోపణలకు బదులిచ్చిన బాలీవుడ్ స్టార్!