Site icon NTV Telugu

కేసీఆర్ ఆ ఎమర్జెన్సీని చదివి అమలు చేస్తున్నాడు…

అధికారాన్ని కాపాడుకునేందుకు ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. శాంతి భూషణ్ అనే అడ్వాకేట్ లేకపోతే ఇందిరాగాంధీ చేసిన తప్పిదాలు ప్రజలకు తెలిసేవి కావు. అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 86లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసింది. చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించే కృషి చేయాలి. ప్రశ్నిస్తే పత్రికలను అణిచివేస్తూ, జర్నలిస్టులను అరెస్ట్ చేయిస్తుంది తెరాస ప్రభుత్వం అని తెలిపారు. కేసీఆర్ ఆ ఎమర్జెన్సీని చదివి అమలు చేస్తున్నాడు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఆనాటి పోరాట చరిత్రను పునికిపుచ్చుకొని ఉద్యమిస్తాం. సీపీఐ ఎమర్జెన్సీకి మద్దతు తెలిపింది.. ఇప్పుడు ఎమర్జెన్సీలో పాల్గొన్నాం అని చెప్పుకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.

Exit mobile version