శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులను… స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డు తగిలారంటూ… మంత్రి తలసాని తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని ఆమోదించిన సభాపతి… ముగ్గురిపై ఈ సమావేశాల ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. ముగ్గురు ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. రెండు నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందన్నారు. ఇక, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా… రాజ్యాంగాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు మండిపడ్డారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కేసీఆర్‌కు… సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి… ఫిర్యాదు చేశారు.
Read Also: Women’s Day 2022: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు.. మానవ జాతికి మహిళ ఒక వరం
రాష్ట్ర శాసనసభలో జరిగిన ఘటనపై గవర్నర్ కి వివరించామని.. గవర్నర్ ను పిలవక పోవడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పామని.. మేం మూడో వరుసలో నిలబడి ఉన్నాం.. కాంగ్రెస్ నేతలు మొదటి వరుసలో ఐదుగురు నిలబడ్డారు.. స్పీకర్ కు నివేదించేందుకు కొంత ముందుకు వెళ్లారు రాజాసింగ్, గతంలో స్పీకర్ లు ఇలా వ్యవహరించి ఉంటే మీరు ఇలా ఉండేవారా అని ప్రశ్నించారు రఘునందన్ రావు.. ఈ రోజు జరిగిన ఘటన నాలుగున్నర కోట్లమందికి జరిగిన అవమానం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడమని రిప్రజెంటేషన్ ఇవ్వమని అడిగాం, కచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పారన్నారు.. ఇక, గత దశాబ్ద కాలంగా వస్తున్న సాంప్రదాయాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు ఈటల రాజేందర్.. కెసీఆర్ వ్యవహారం జుగుప్సాకరంగా ఉందన్న ఆయన.. అందరూ నేను చెప్పినట్టు వినాలనుకుంటున్నారు. ప్రజలు సిగ్గు తలదించుకునేలా చేసారు.. భవిష్యత్తు లో ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరితే మా మొహాలు చూడకూడదు అని సస్పెండ్ చేశారని మండిపడ్డ ఆయన.. మాపై జరిగిన దాడిని ప్రజలకు వివరిస్తాం.. అతిపెద్ద రాజ్యాంగం మనది… ప్రజాస్వామ్యం కాపాడే ప్రయత్నం చేస్తాఅని గవర్నర్ హామీ ఇచ్చారు తెలిపారు.
