MLA Rajasingh: బీజేపీ లేకుంటే.. కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Rajasingh Warns CM KCR and TRS Leaders: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రోజురోజుకి తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న బలం చూసి టీఆర్ఎస్ వెన్నులో వణుకుపుడుతోందన్నారు. ఈటెల రాజేందర్‌తో పాటు ఇతర బీజేపీ నాయకులపై కొందరు టీఆర్ఎస్ నాయకులు ఏవేవో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈటెల గురించి మాట్లాడే అర్హత తెరాస నాయకులకు లేదని, హుజురాబాద్‌లో ప్రజలు ఆమోదం తెలియజేసి ఆయన్ను గెలిపించారన్న విషయాన్ని టీఆర్ఎస్ గుర్తు పెట్టుకోవాలన్నారు. తెరాసను వ్యతిరేకించి బయటికి రావడం వల్లే ఈరోజు ఈటెలపై నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బురద రాజకీయాలు మీరు చేస్తూ.. ఎదుటివారిని విమర్శించడం మీ నైజం అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందని, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఈ కుట్ర జరుగుతోందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూసి.. సామాన్య మానవుడు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడని రాజాసింగ్ సెటైర్లు వేశారు. దేశమంతా బీజేపీ గెలుస్తుందని, తెలంగాణలో కూడా క్షేత్రస్థాయి నుంచి బీజేపీ బలపడుతోందని అన్నారు. బిజెపి ఎదుగుదలని ఓర్వలేకే కల్వకుంట్ల కుటుంబం ఉలిక్కి పడుతోందని.. అందుకే తమ వంది మాగధులతో అవాక్కులు, చవాక్కులు మాట్లాడిస్తున్నారన్నారు. క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి రాష్ట్ర గవర్నర్ ఏమైనా శాస్త్రవేత్తనా అని ప్రశ్నించడానికి ముందు.. కెసీఆర్ ఏమైనా శాస్త్రవేత్తనా? అనే ప్రశ్న వేసుకుంటే బాగుంటుందని నిలదీశారు. రాష్ట్రంలో సమస్య ఎక్కడ ఉంటే, అక్కడ గవర్నర్ వెళ్తున్నారన్న విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు గుర్తు పెట్టుకుంటే మంచిదని సూచించారు. గౌరవప్రదమైన రాజ్యంగ పదవిలో ఉన్న మహిళా గవర్నర్‌ను గౌరవించడం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు నేర్చుకోవాలని కోరారు.
Also Read
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Harish Rao : సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
- Komatireddy Venkat Reddy : రేవంత్‌పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
- KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కూడా ఉందని, పార్లమెంట్‌లో పెట్టిన బిల్లుకు బీజేపీ సపోర్ట్ చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న కనీస జ్ఞానం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అసలు బీజేపీ లేకపోయి కేసీఆర్ సీఎం అయ్యుండేవారు కాదన్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కాకుండా ఉండేవారన్న సంగతిని గుర్తంచుకోవాలన్నారు. మీ అందరి పదవులు బీజేపీ పెట్టిన భిక్ష అని మండిపడ్డ రాజాసింగ్.. బీజేపీ నాయకులపై విమర్శలు చేసేముందు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!