రాజగోపాల్ రెడ్డి 2006 నుంచే నాకు మంచి మిత్రుడని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. పోరాట స్పూర్తి ఉన్న మిత్రుడు రాజగోపాల్ రెడ్డి అని ఈటల పేర్కొన్నారు. రేవంత్ మాటలు సమాజం అసహ్యించుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. రేవంత్ గత బ్లాక్ మెయిల్ ఇంకా మరిచినట్లు లేదని విమర్శించారు. రేవంత్ నాలుగు పార్టీలు మారిండని, నిరాశ, నిస్పృహలో రేవంత్ మాట్లాడుతున్నారని ఈటల విమర్శించారు. కాంగ్రెస్ కనుమరుగు అవుతుంది.. ఎందుకు ప్రజాధారణ కోల్పోతుందనే దానిపై శోధించకుండా ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణం కాంగ్రెస్ అని ఈటెల గుర్తు చేశారు.
read also: Karthikeya-2: ఓరోజు వెనక్కి వెళ్ళిన నిఖిల్ ‘కార్తికేయ-2’ విడుదల
రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజగోపాల్ రెడ్డిని ఆర్థికంగా దెబ్బతీశారని పేర్కొన్నారు. అయినా పార్టీ కోసం పనిచేశారని ఈటెల చెప్పుకొచ్చారు. రేవంత్ కి సోయి ఉందా? అంటూ ప్రశ్నించారు. సర్పంచులకు బిల్లులు రావడం లేదు.! ఏ రోజైనా ఆడిగినవా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీటీసీలకు, జెడ్పిటీసీలకు నిధులు ఉన్నాయా ? అంటూ ప్రశ్నించారు ఈటెల. కాంగ్రెస్ పార్టీ సహకరించకపోయినా అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి అన్ని సమస్యలపై మాట్లాడారని గుర్తుచేసారు. మునుగోడు ప్రజలు.. అంతరించిపోతున్న కాంగ్రెస్ ని బలపరిచే పరిస్థితి లేదని ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే నియోజకవర్గాలకు నిధులు వచ్చే పరిస్థితి ఉందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
Lucky Lakshman: సినిమా నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ రిలీజ్