Lucky Lakshman: సినిమా నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో సోహైల్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఫెమ్ సోహైల్ హీరోగా దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిస్తోన్న “లక్కీ.లక్ష్మణ్‘’ సినిమా నుంచి “అదృష్టం హలో అంది రో.. చందమామ” టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ ను మజిలీ, ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ రిలీజ్ చేసారు.
కథ:
చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ సినిమాలోని ‘అదృష్టం హలో అంది రో.. చందమామ’ టైటిల్ లిరికల్ విడియో సాంగ్ ను మజిలీ, ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ విడుదల చేశారు.
Also Read
- Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
- Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
- Janvi Kapoor: 'పెద్ది' దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
సాంగ్:
అదృష్టం హలో అంది రో చందమామ,
హగ్గిచ్చి చలో అందిరో చందమామ,
ఒరయ్యో ఓవర్ నైట్ లో చందమామ,
రిచ్ కిడ్ అయిపోయాడురో చందమామ, అంటూ సాగే ఈ పాటను చూస్తుంటేనే డ్యాన్స్ వేద్దాం అనిపించేలా ఉంది. హీరో సోహైల్ “అదృష్టం హలో అంది రో చందమామ” అంటూ సాగే లిరిక్స్ రిచ్ కిడ్ ‘హవా’లో సాగుతున్న ఈ పాటకు సోహైల్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా అని చెప్పవచ్చు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ పాటలకు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రంలోని పాటలు కూడా ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తాయి.
ఈ సందర్బంగా ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ..”లక్కీ లక్ష్మణ్” లోని ఈ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఈ చిత్ర దర్శకుడు ఏ ఆర్.అభి , నిర్మాత హరిత గిగినేని లకు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
చిత్ర హీరో సొహైల్ మాట్లాడుతూ. దర్శకులు శివ నిర్వాణ గారు ఎంతో బిజీగా ఉన్నా మా ”లక్కీ లక్ష్మణ్” టైటిల్ సాంగ్ విడియోను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తాజాగా ఈ సినిమా సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు. దర్శకులు ఏ ఆర్. అభి , నిర్మాత హరిత గిగినేని లకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ అవుట్‌పుట్ పరంగా క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించిన, ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.
చిత్ర దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ…మంచి డీఫ్రెంట్ సబ్జెక్టు తో వస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి,టైటిల్ సాంగ్ ను శివ నిర్వాణ గార్ల చేతులమీదుగా విడుదల చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.సాంగ్ టీజర్ కు, ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ మాకు ఫుల్ సపోర్ట్ చేయడంతో షూటింగ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. “లక్కీ లక్ష్మణ్”. సినిమా కచ్చితంగా సోహైల్ కు టర్నింగ్ పాయింట్ అవుతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.
నటీనటులు:
సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ, రచ్చ రవి , జబర్దస్త్ కార్తిక్ , జబర్దస్త్ గీతు రాయల్ కామెడీ స్టార్స్ ఫేమ్ యాదం రాజు తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్స్ – దత్తాత్రేయ మీడియా, నిర్మాతలు – హరిత గోగినేని, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – ఏఆర్ అభి, సంగీతం – అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ – ఐ. ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, పాటలు – భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ – విశాల్, ఆర్ట్ డైరెక్టర్ – చరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయానంద్. కీత, పీఆర్వో – నాయుడు-ఫణి, మార్కెటింగ్ పార్ట్ నర్ – టికెట్ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే, కాస్టింగ్ డైరెక్టర్ – ఓవర్ 7 ప్రొడక్షన్స్
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!