Site icon NTV Telugu

BJP: నేడు హస్తినకు బీజేపీ నేతలు.. రేపు ఎన్డీఏ ఎంపీల సమావేశం..

Bjp

Bjp

BJP: తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ హస్తినకు వెళ్తున్నారు. ఎంపీలుగా గెలిచిన బండి సంజయ్, డీకే అరుణ, రఘనందనరావు తదితరులు ఢిల్లీ వెళ్తున్న వారిలో ఉన్నారు. రేపు ఢిల్లీలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరుకానున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ప్రస్తుతం మోడీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగింది. ఎంపీలుగా గెలిచిన పార్టీ నేతలతో ప్రధాని మోడీ శుక్రవారం భేటీ కానున్నారు. అనంతరం మిత్రపక్షాల నేతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

Read also: Train Accident: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో గూడ్స్ రైలును రైలు ఢీ.. నలుగురు మృతి

కేబినెట్‌లో ఎవరెవరు ఉండాలనే దానిపై చర్చించనున్నారు. ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలి. రాజకీయ అనిశ్చితికి ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు, నితీశ్ గట్టిగా సూచించినట్లు ఎన్డీయే వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే మోడీ కేబినెట్‌లోని పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈసారి హోం శాఖ కాకుండా వేరే శాఖ కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జేడీయూ ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని ఎన్డీయే వర్గాలు చెబుతున్నాయి. కాగా, మోడీ మంత్రివర్గంలో చేరాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
loksabha election results: బీజేపీ గెలుపు పై అంతర్జాతీయ మీడియా ఫోకస్..

Exit mobile version