NTV Telugu Site icon

BJP Leaders: నేడు రాష్ట్రానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఎవరెవరు అంటే..

Bjp Ledears

Bjp Ledears

BJP Leaders: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి రెండంకెల సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో కమలం పార్టీ రాష్ట్రంలో ప్రచారంలో దూసుకుపోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటించారు. పార్టీ అభ్యర్థుల తరపున సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఈరోజు మరోసారి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Read also: SRH vs MI: నేడు ముంబైతో సన్రైజర్స్ ఢీ.. 300 స్కోర్పై కన్నేసిన ఎస్ఆర్హెచ్

ఎక్కడ.. ఎప్పుడు..

నేడు పెద్దపల్లి లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా పర్యటించనున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ గోదావరిఖనిలోని జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 11 గంటలకు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక మధ్యాహ్నం 12.30 గంటలకు భువనగిరి పార్లమెంట్ చౌటుప్పల్ లో సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నల్గొండలో బహిరంగ సభల్లో నడ్డా పాల్గొంటారు. ఇక బీజేపీ తమిళ్ నాడు అధ్యక్షులు అన్నామలై రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జమ్మికుంట లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. 3 గంటలకు కల్వకుర్తిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Read also: PM Modi AP Tour: నేడు ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం.. రాజమండ్రిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఇక సాయంత్రం 6 గంటలకు సనత్ నగర్ నుండి పద్మారావు నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఇవాళ ఉదయం 11 గంటలకు ముషీరాబాద్ లో యువ సమ్మేళనంలో హాజరుకానున్నారు. మధ్నాహ్నం 12.30 గంటలకు నర్సంపేట లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 కి మహబూబ్ నగర్ లోని బీజేపీ మేధావులతో సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సాయంత్రం రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ ఇంపిరియల్ గార్డెన్ లో ప్రవాసి సమ్మేళనంలో భజన్ లాల్ శర్మ పాల్గొననున్నారు.
Geethanjali Malli Vachindi : ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?