Harish Rao: బీజేపీ నాయకులు గల్లీ నేతలకంటే దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావ్ మండి పడ్డారు. తెలంగాణ భవన్ లో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ సభతో బీజేపీ నేతలకు కంటిమీద కునుకులేదని హరీశ్ రావ్ అన్నారు. కేసీఆర్‌పై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న వారు మట్లాడిన మాటలు పచ్చి అపద్దాలని మండిపడ్డారు. సాక్షాధారాలతో సహా నిరూపిస్తా అని హరీశ్ రావ్ అన్నారు. ఎనిమిదేండ్లలో ఏమీ చేయని టీఆర్‌ఎస్ పదిహేను రోజుల్లో ఏం చేస్తుందని అంటున్న బీజేపీ వాళ్లు మేము ఎనిమిదేండ్లలో ఏం చేయలేదా? అన్ని ప్రశ్నించారు. రండి మునుగోడుకు 99 శాతం ఎలా అభివృద్ధి చెందిందో తెలుపుతామన్నారు. కిషన్ రెడ్డి, బండిసంజయ్ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని హరీశ్ రావ్ విమర్శించారు. కేసీఅర్ సభలో బీజేపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా అయ్యిందని అన్నారు. కేసీఅర్ సభ తర్వాత బీజేపీ నాయకులు స్థాయినీ మరిచి పిచ్చి పిచ్చిగా మాట్లాడారని మంత్రి మండిపడ్డారు. దివలకొరు, దిక్కుమాలిన నాయకులు బండి సంజయ్ ,కిషన్ రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు. ఈ ఇద్దరి నేతల స్థాయి ఏంటో ఢిల్లీ నుంచి వచ్చిన దూతలు ఏమి చెప్పారో విన్నామన్నారు. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక్క నిజం లేదన్నారు.
Read also: Konda Surekha Live: పూనమ్ చేతిని రాహుల్ కావాలని పట్టుకోలేదు
మునుగోడులో 99 శాతం మందికి కేసీఅర్ సర్కార్ ఫలాలు అందాయని తెలిపారు. బీజేపీ వల్ల కూడా లబ్ధి జరిగిందని, ప్రజలపై భారం మోపిందని ఎద్దేవ చేశారు. అన్ని పెంచారని మండిపడ్డారు. కానీ కేసీఅర్ సర్కార్ వివిధ స్కీమ్ లతో ఫలాలు పంచిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా ఎమ్మెల్యేలు నిలబడ్డారని అన్నారు. మేము రాజ్యాంగ బద్దంగా విలీనం చేసుకున్నామని అన్నారు. బీజేపీ వివిధ రాష్ట్రాల్లో విలీనం చేసుకున్నారు అది కరెక్ట్ అవుతుందా ? అని మంత్రి హరీశ్ రావ్ ప్రశ్నించారు. రఘురాం కృష్ణం రాజు మీద ఎందుకు అనర్హత వేటు వెయ్యలేదు ? అని ప్రశ్నించారు మంత్రి. బీజేపీ దొడ్డిదారిన ప్రభుత్వాలను పడగొట్టిందని అన్నారు కేంద్రం మీటర్లు పెట్టమని రాష్ట్రానికి లేఖలు రాసిందని, మరి కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఏం అంటారు ? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కేంద్రం నుంచి 30 వేల కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్,కిషన్ రెడ్డి లు మనుషులేనా ? అని మండిపడ్డారు. నేను చేనేత GST మీద సంతకం పెట్టిన అని అంటున్నారు అది పచ్చి అబద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతపై GST నీ తెలంగాణ ప్రభుత్వం మినహాయించాలని కోరింది. అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కౌన్సిల్ లో చేనేత మీద GST వద్దని స్పష్టం చేశారు, మీ పక్కనే ఉన్నారు కదా అడగండి అంటూ మంత్రి హరీశ్ చురకలంటించారు.