NTV Telugu Site icon

ఈటల గెలుపు.. బీజేపీ గెలుపు..

ఈటల రాజేందర్‌.. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.. దీంతో.. వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు అయ్యింది.. అయితే, ఈ ఎన్నికల్లో విజయం క్రెడిట్‌ అంతా ఈటల రాజేందర్‌దే అనే చర్చ సాగుతోంది.. ఈటల లేకుండా హుజురాబాద్‌లో బీజేపీకి అన్ని ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయని అని గణాంకాలు వేసేవారు కూడాలేకపోలేదు. అయితే, ఇవాళ ఈటల రాజేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్.. ఈటల రాజేందర్‌ గెలుపు బీజేపీ గెలుపు అన్నారు.. రాజకీయ నాయకులను, ప్రజలను అణిచి వేయాలని చూసిన ప్రజలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు వివేక్.. రాజకీయ మార్పుకు ఈటల గెలుపు నాందిగా అభివర్ణించారు. కాగా, హుజురాబాద్‌ విజయంతో బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది.. ఈటల గెలుపును రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.