NTV Telugu Site icon

ప్ర‌జారోగ్యాన్ని కేసీఆర్ గాలికొదిలేశారు.. రాముల‌మ్మ ఫైర్‌

క‌రోనా విష‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌రోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు బీజేపీ నేత విజ‌య‌శాంతి అలియాస్ రాముల‌మ్మ‌… రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశార‌ని ఆరోపించిన ఆమె.. ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణ లేద‌ని దుయ్య‌బ‌ట్టారు… పీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించడంలేద‌ని మండిప‌డ్డారు. ఇక‌, కేసీఆర్.. ఆయుష్మాన్ భారత్‌ను, ఆరోగ్యశ్రీని ఎందుకు అమలు చేయట్లేదు అని ప్ర‌శ్నించిన ఆమె.. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయనందుకు నిరసనగా… ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలన్న డిమాండ్‌తో జరగబోతున్న “గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష”ను విజయవంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. మ‌రోవైపు.. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5 లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుంది.. ఈ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయింద‌న్నారు రాముల‌మ్మ‌… తన బంధువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే.. దీనిపై కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోల‌దంటూ ట్వీట్లు చేశారు.