తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి శనివారం (జనవరి 24) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మధుసూదన్ రెడ్డి, నానక్‌రాంగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న బీజేపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
మధుసూదన్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యకర్తలు, అభిమానులు, ఇతర నేతల అంతిమ సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని తన నివాసానికి తరలించారు. తన నియోజకవర్గంలో చురుకైన నేతగా పేరున్న ఆయన మరణంతో చంపాపేట్ పరిధిలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Google Photosలో కొత్త meme ఫీచర్.. ఆ టూల్‌ని ఎలా ఉపయోగించాలంటే..!
