NTV Telugu Site icon

కేసీఆర్ పొమ్మనకుండా పోయేలా చేస్తున్నారు..!

Swamy Goud

Swamy Goud

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరిని పొమ్మనకుండానే పోయేలా చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు స్వామిగౌడ్… మాజీమంత్రి ఏ. చంద్రశేఖర్ నివాసంలో కొందరు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు.. స్వామిగౌడ్, యెన్నం శ్రీనివాసరెడ్డి, గాదె ఇన్నయ్య, బెల్లయ్య నాయక్, కపిలవాయి దిలీప్ కుమార్, బండి సదానంద్, రాములు నాయక్, రాణి రుద్రమ్మ తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశ్యంతో సాధించుకున్నామో ఆ విధంగా కలలు సహకారం కావడంలేదన్నారు.. ఉద్యమంలో చిన్న స్థాయి నుండి పై స్థాయి అధికారుల వరకు పాల్గొన్నరూ.. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొమ్మనకుండానే పోయేలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కేసీఆర్ కి అన్ని విద్యలు ఇచ్చాడు.. దేవుడు.. మోసం చేసినవారిని కాకుండా ఉద్యమంలో కష్టపడ్డవారిపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.. ఈటల రాజేందర్ ఎన్నికను ఒక అవకాశంగా తీసుకొని ప్రజా స్వామ్య వేదిక సిద్ధం చేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేవామన్న స్వామిగౌడ్.. ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ ఆహ్వానిస్తున్నాం.. ప్రజలు దేనికోసం ఆశించారో ప్రస్తుతం అది నెరవేరడం లేదు.. రేపు హుజురాబాద్ ఎన్నిక రాబోయే ప్రజాస్వామ్యానికి గట్టి పునాది కావాలని.. పార్టీలకి అతీతంగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.