Site icon NTV Telugu

Revuri Prakash Reddy: రోడ్లపై నాట్లు వేసి నిరసన.. బాగుచేస్తారా? లేదా?

Revuri

Revuri

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వ్యవహారం ప్రతి జిల్లాలో రసవత్తరంగా సాగుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు బీజేపీ నేతలు. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ నేతలు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. తాజాగా నర్సంపేటలో బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి తనదైన రీతిలో టీఆర్ఎస్ పాలనను ఎండగడుతున్నారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల ఇబ్బందులు టీఆర్ఎస్ నేతలకు పట్టవని గత ఎనిమిది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఏవిధంగా ఉందో నర్సంపేటలోని రోడ్ల దుస్థితి చూస్తే అర్థమవుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

Read Also: Kishan Reddy: బయోమెడికల్ పరిశోధనకు కేరాఫ్ అడ్రస్ NARFBR

ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి నర్సంపేట పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, కుమ్మరికుంట, పార్కు, సర్వాపురం బైపాస్ రోడ్డు ప్రాంతాలలో నేతలతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల దుస్థితిని చూసి ఆయన బాగా చలించి పోయారు. మహిళలతో కలిసి వరి నాట్లు వేసి. స్థానిక ఎమ్మెల్యే పనితీరును, ప్రభుత్వ పాలనను ఎండగడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిదేళ్ళ టీఆర్ఎస్ పాలనలో ప్రజల ఇబ్బందులు పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విఫలం చెందారన్నారు.

నియోజకవర్గ కేంద్రమైన నర్సంపేట మున్సిపాలిటీలో రోడ్ల దుస్థితి చూస్తే అర్థమవుతుందని ప్రకాష్ రెడ్డి అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీలోని కాలనీలు మారుమూల గ్రామాల కంటే అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, వర్షం పడితే చాలు రోడ్లపై ప్రజలు నడిచే పరిస్థితి లేదన్నారు. సర్వాపురంలో ఇటీవల రోడ్డపై నడుస్తూ మండల సారమ్మ కాలు విరిగిందని కనీసం వైద్య సౌకర్యం కూడా అందించలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి రోడ్లు బాగుచేయాలని డిమాండ్ చేశారు.

Read Also: Sun In Middle Age: నడి వయస్సుకు సూరీడు. వెలుగునిచ్చే వాడే భూమిని కబళించబోతున్నాడా?

Exit mobile version