Site icon NTV Telugu

BJP Leader Prakash Reddy : మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాటల పచ్చి అబద్ధం..

కేంద్ర ప్రభుత్వం నేడు రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నేషనల్ హైవే పథకాలకు నిధులు మంజూరు చేయడంపై జరిగిన కార్యక్రమంలో ఎక్కడ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ని బీజేపీ అడ్డుకున్నది లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ అడ్డుకున్నది అని చెప్పడం పచ్చి అబద్ధమని, దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వడం లేదు అని ఒక పక్క పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి నేషనల్ హైవే ప్రాజెక్టులకు 25 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు ఒప్పుకోవడం సంతోషకరమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి వచ్చిన నిధులుపైన అబద్ధాలు చెప్పకుండా ఒప్పుకోవాలని, నితిన్ గడ్కరీ అభివృద్ధికి సూచిక అని మాట్లాడడం సంతోషకరమన్నారు. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అనే లక్ష్యంతో ముందుకు వెళుతుందన్నారు. నేషనల్ హైవే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపినట్లుగా వివరించడం అభివృద్ధి కాదా ? అని ఆయన ప్రశ్నించారు.

Exit mobile version