Maheshwar Reddy: కేకే కడిగిన ముత్యం అయ్యారని, రామ్మోహన్ అనిముత్యం అయ్యారని బీజేపీ శాసన సభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ధరణి కుంభకోణం.. 2 లక్షల కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నారు. హరీష్ రావు, కేటీఆర్ లు ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఉపేక్షిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 115 రోజులు అయింది ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి జరిగింది అని ఆరోపించిన రేవంత్ రెడ్డీ ఎందుకు ఆ కుంభకోణాన్ని వెలికితీయడం లేదన్నారు.
Read also: Maneka Gandhi: వరుణ్ గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి..!
24 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములు ఉంటే ఈ రోజు మిగిలింది 6 లక్షల ఎకరాలు మాత్రమే…ఆ భూములు ఎక్కడికి పోయాయి… ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. 60 వేల ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని అన్నారు. ప్రోహిబిటెడ్ లిస్ట్ లో 14 లక్షల ఎకరాలు పెట్టారు… ఈ భూ యజమానులు ను భయపెట్టి తక్కువ ధరకు కొన్నారని తెలిపారు. కేకే కడిగిన ముత్యం అయ్యారు… రామ్మోహన్ అనిముత్యం అయ్యారని అన్నారు. రంజిత్ రెడ్డి దేవాదాయ భూములు కబ్జా చేశారని అన్నారు… ఈ రోజు అనిమిత్యామై మీ అభ్యర్థి అయ్యారని తెలిపారు. కేంద్ర దర్యాప్తుకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. అవకతవకలు ఎందుకు పబ్లిక్ లో పెట్టడం లేదన్నారు. ఆర్ టాక్స్ తో పాటు కొత్తగా బీ టాక్స్ తెరపైకి వచ్చిందని అన్నారు.
Read also: Vijay Deverakonda: ఆ విషయంలో జాగ్రత్త పడుతున్నా.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు!
బిల్లులు క్లియర్ కావాలంటే 8 నుండి 9 శాతం ఇవ్వాలి అట అన్నారు. బీ అంటే బట్టి టాక్స్ కాదన్నారు. కాంట్రాక్టర్ లు వచ్చి మాకు చెప్పుకుంటున్నారన్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలని అనుకుంటున్నారని, 13 వారాల్లో 13 వేల కోట్లు బాకీలు తెచ్చారన్నారు. అబద్దాల పునాదుల మీద ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. కోమటి రెడ్డి ఏమైనా సీఎం ఆ.. ప్రధాన ఆయన దగ్గరికి వెళ్లి మంత్రి పదవి ఇవ్వడానికి అన్నారు. నా కంఠం లో ప్రాణం ఉన్నంత వరకు బీజేపీ కార్యకర్తగా ఉంటానని అన్నారు. నాది పార్టీలు మారే సంస్కృతి కాదన్నారు. సైకిల్ కాంగ్రెస్ కు వరిజినల్ కాంగ్రెస్ కు మధ్య జరిగిన కొట్లాట వల్లే నేను పార్టీ మారానని అన్నారు.
North Korea: జపాన్ సముద్రంలోకి నార్త్ కొరియా క్షిపణి