NTV Telugu Site icon

తోడేళ్ళుగా విరుచుకుపడుతున్నారు : ఈటల

etela rajender

etela rajender

గత మూడు నెలలుగా హుజురాబాద్ కి చీకటి అధ్యాయంగా పోలీసులు నిర్బంధం చవి చూస్తున్నది. నా రాజీనామా తర్వాత ఏ నిబంధన ప్రకారం ఏ చట్టం ప్రకారం ఇతర ప్రాంతాల వారిని ప్రోటోకాల్ సంభందము లేకుండా ఇంఛార్జ్లు వచ్చారు. హుజురాబాద్ ప్రజలపై తోడేళ్ళు గా విరుచుకుపడుతున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈటల మాట్లాడుతూ… బీజేపీ కార్యకర్తలపై నాయకులపై నిరంతరం ఫోన్ ట్యాపింగ్ లు చేయడం నిఘా పెట్టడం చేస్తున్నారు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాష్ట్రంలో నిషేధించబడిన పార్టీగా అభివర్ణిస్తున్నారు. ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఇంటిలిజెన్స్ పోలీసులు యువకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బీజేపీకి పోతే పెన్షన్ రాదు,రైతు బంధు రాదు,దళిత బంధు రాదని నికృష్ట ఆలోచనలు చేస్తున్నారు. కేసీఆర్ కూలి పని చేసి ఏమి రేషన్ కార్డు పెన్షన్లు ఇవ్వడని చెబుతున్నాము. నియంతృత్వ ధోరణితో కేసీఆర్ హుజురాబాద్ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారుఅని తెలిపారు

ప్రస్తుతం హుజురాబాద్ లో జనం భయంతో బతుకుతున్నారు. జనం ఇబ్బందులు పోలీస్ ఓవర్ యాక్షన్ పై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశాం.. కోర్టుకు వెళతాం. దళిత బంధును హుజురాబాద్ లో నోటిఫికేషన్ ముందు అందరికి ఇవ్వాలని కోరినము. ఊరికి 10 మందిని సెలెక్ట్ చేయడం స్థానికంగా లేని వారిని ఆర్థికంగా ఇబ్బందులు లేని వారిని పార్టీ జెండాలు కప్పుకున్నవాళ్లకు ఇవ్వడం దరిద్రపు పద్ధతి. హుజురాబాద్ లోని అన్ని దళిత వాడాలో ప్రభుత్వ నాటకాలు పై శాపనార్ధాలు పెట్టారు. అన్ని మండలాల్లో బిజెపి కార్యకర్తలను,దళిత చైతన్య నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. పోలీస్ స్ట్రేషన్ లో పెట్టి అన్నం కూడా పెట్టకుండా ఉంచుతున్నారు.దీనిపై మానవ హక్కుల కమిషన్ కి వెళ్తాము. పద్ధతి మార్చుకుని లేకుంటే మేము తిరగపడతాము అని పేర్కొన్నారు.

ఇక ఓ సీడ్ కంపిని డబ్బులు రావని టీఆర్ఎస్ వైపు ఉండాలని ఇబ్బందులు పెడుతున్నారు. ఆనాడు కేసీఆర్ ఎన్నిక సమయంలో అప్పడు ఇలానే చేసిన వారికి కర్రు కాల్చి వాత పెట్టారు. హుజురాబాద్ ఏమన్నా గుత్తా పట్టారా, మేము ఏమన్నా బానిసలమా పిచ్చి పనులు మంచిది కాదు. దళిత బంధుతో పాటు అన్ని వర్గాలకు 10 లక్షలు ఇవ్వాలి. దళిత బంధు కేవలం పేపర్లకే పరిమితి అయితే బండకేసి కొడతారు. ఓట్లు దండుకొని పోతాం అంటే ఇక్కడ ఎవరు అమాయకులు లేని హుజురాబాద్ చైతన్యవంతమైన ప్రాంతం. కేసీఆర్ హరీష్ రావు మనమీద ప్రేమతో ఇవ్వట్లేదు కేవలం ఓట్లకోసమే ఇస్తున్నారు. కుల సంఘాల భవనాలు మహిళా భవనాలు ఇవ్వండి అని తెలిపారు ఈటల.