Site icon NTV Telugu

నేను గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచి నట్టు : ఈటల

కరీంనగర్ జిల్లా ఇళ్లంతకుంట మండల బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… మా నియోజక వర్గంలో ప్రజా ప్రతినిధులు నాకు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధం ఉంది. కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. తల్లి తండ్రి విడిపోయినప్పుడు పిల్లలను పంచుకునే సమయంలో తల్లిదండ్రులు పడే వేదన నాది మా ప్రజా ప్రతినిధులది. మమ్మల్ని విడగొట్టి పాపం మూటగట్టుకున్నారు. కేసీఆర్ దుర్మార్గాలకు గొరి కట్టే బాధ్యత హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలపై ఉంది. నా మీద కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. నాపై వచ్చిన ఆరోపణలపై కనీసం వివరణ కోరకుండా మంత్రి పదవి నుంచి తొలగించారు. కనీసం స్పీకర్ కూడా రాజీనామా పత్రం తీసుకునేందుకు రాలేదు. 6 సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన నన్ను గెలిచిన నన్ను కనీసం వివరణ కోరకుండా రాజీనామాను ఆమోదించారు అని తెలిపారు.

Read Also : ఏపీలో ఆ జిల్లాల కలెక్టర్లపై వేటు పడనుందా…?

ఎందుకంటే అసెంబ్లీలో ఈటల రాజేందర్ అనేటోడు ఉంటే వరిదాన్యం కొనుగోలు కేంద్రాల గురించి, పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదనీ ప్రశ్నిస్తాడని వీడు అసెంబ్లీకి రావద్దని అడ్డుకున్నారు. మీ కుట్రలకు తగిన బుద్ది చెప్పనేసుకు హుజూరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉండాలి. పదవులు వట్టిగా రాలే పోరాడితే కష్ట పడితే వచ్చాయి. రైలు పట్టాల పై పడుకున్నాం, అనేక కేసులు బరిస్తే వచ్చాయి హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం ప్రజల విజయం. నేను గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచి నట్టు, ఓడితే ప్రజాస్వామ్యం ఒడినట్టు అని పేర్కొన్నారు ఈటల.

Exit mobile version