Site icon NTV Telugu

Nirmal Minor Girl Incident: తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ కరువు

తెలంగాణలో ఆడపిల్లలు, మైనర్ బాలికలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు ఆకుల విజయ. నిర్మల్ మునిసిపల్ వైస్ ఛైర్మెన్ నిర్మల్ నుండి మైనర్ బాలికను హైదరాబాద్ కి తీసుకువచ్చి అత్యాచారం చేశారు. తవరకు అతడిని అరెస్ట్ చేయలేదు. టి ఆర్ ఎస్ నాయకుడు కాబట్టే ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు.

అలాగే, సిరిసిల్లలో ఒక అమ్మాయి మిస్ అయ్యి నెల రోజులు అయింది. కేటీఆర్ నియోజకవర్గంలో అమ్మాయి మిస్ అయినా ఇంతవరకు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తెలియదు. కేటీఆర్ నియోజకవర్గములో ఇలాంటి మిస్సింగ్ కేస్ అయితే పోలీసులకు కన్పించడం లేదా? అని ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలకు సంబంధం ఉంది కాబట్టే పోలీసులు సైలెంట్ అయ్యారని ఆకుల విజయ ఆరోపించారు.

https://ntvtelugu.com/guinnis-record-for-longest-test-match-between-south-africa-and-england/

ఫ్రెండ్లీ పోలీసులు కాదు…టీఆర్ఎస్ పార్టీకీ పోలీస్ లు తొత్తులుగా మారారన్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించని కేసీఆర్ దేశానికి ప్రధాని అవుతారు అంట. అత్యాచారం చేసిన మునిసిపల్ వైస్ చైర్మన్ ను వెంటనే అరెస్టు చేయాలి. మహిళ ల మీద అత్యాచారం జరుగుతుంటే కవిత ఎందుకు స్పందించడం లేదు. ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఎంజాయ్ చేయడం కాదు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పైన స్పందించాలని ఆకుల విజయ డిమాండ్ చేశారు. మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల పైన స్పందించడం లేదెందుకు కవిత. నువ్వు మహిళవి కావా కవిత అని ఆమె ప్రశ్నించారు.

Exit mobile version