కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ.. తండ్రి పేరు చెప్పుకొని మంత్రి పదవులు అనుభవిస్తున్నారంటూ బీజేపీ నేత లక్ష్మణ్ అగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్, తెలంగాణలను బలవంతంగా దేశం లో కలపబడ్డాయి అని మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావుకు అబద్దాల లో అవార్డు ఇవ్వవచ్చు అంటూ ఆయన మండిపడ్డారు. అబద్ధాల యూనివర్సిటీకి వీసీ చేయోచ్చు హరీష్ రావును.. హరీష్ రావు ఓ అబద్దాల పుట్ట అంటూ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ కు బీటలు వారుతున్నాయి.. టీఆర్ఎస్ పార్టీ పుట్టీ మునిగి పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తెలంగాణ ద్రోహులు కూడా బీజేపీ పై మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ మజ్లిస్ చెప్పుచేతల్లో పనిచేస్తుందని, విమోచన దినోత్సవం జరుపుతామని చెప్పిన మీరు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
అమిత్ షా అంటే ఎందుకు చిర్రెత్తుకొస్తుందని, ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే ఎంతోమంది పేదవారి ప్రాణాలు దక్కేవని, టీఆర్ఎస్ నేతలు బాయిలో కప్పల్లా తయారు అయ్యారన్నారు. ఆవాస్ యోజన నిధులు దారి మళ్లిస్తున్నది మీరు కాదా.. రుణమాఫీ ఎందుకు చేయలేదు అని అమిత్ షా అడిగితే మీకు కడుపు మండుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఓ మంత్రి ట్వీట్ లలోనే కాలం గడుపుతున్నారని, రాష్ట్రం వచ్చి ఎనిమిది ఏళ్ళు అయినా ముంబాయి, దుబాయ్, బొగ్గుబావిగా తెలంగాణ బ్రతుకులు మారిపోయాయన్నారు. ఆరిపోయే దీపంకు వెలుగు ఎక్కువ అన్నట్టుగా టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీ తో ఉన్నారన్నారు.