BJP Corporators: రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో జీహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్ల సమావేశమయ్యారు. జల మండలి, జీహెచ్ఎంసి అధికారులపై గవర్నర్ కు కార్పొరేటర్ల ఫిర్యాదు చేశారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ సమావేశం వాయిదా పడడంపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పొరేటర్లు గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు.
జీహెచ్‌ఎంసీ సమావేశంలో జరిగిన పరిణామాలను బీజేపీ కార్పొరేటర్లు గవర్నర్‌కు వివరించారు. సమస్యలు చర్చించకుండానే జీహెచ్‌ఎంసి సమావేశం బాయికాట్ చేసినందుకు గవర్నర్ కు పిర్యాదు చేశామని బీజేపీ కార్పొరేటర్లు అన్నారు. వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామన్నారు. సంబంధిత అధికారులను పిలిచి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. గ్రేటర్ లో ఇబ్బందులపై కౌన్సిల్ లో మాట్లాడదాం అంటే సమావేశాలు సరిగా నిర్వహించడం లేదని తెలిపారు. అధికారులు ఎన్నికైన కార్పొరేటర్లను అవమానపరిచారని అన్నారు.
తాజాగా జీహెచ్‌ఎంసీ సాధారణ సమావేశం ప్రారంభం కాగానే సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొన విషయం తెలిసిందే. అధికార బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో జలమండలి అధికారులు, జోనల్ కమిషనర్లు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. అయితే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు బహిష్కరించడం ఇదే తొలిసారి. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు. బీజేపీ కార్పొరేటర్లు మినహా మిగిలిన కార్పొరేటర్ల పరిధిలో సమస్యలు లేవా? అని అడిగారు.
సమస్యలపై చర్చించకుంటే ఎలా పరిష్కరిస్తారని మండి పడ్డారు. జీహెచ్‌ఎంసీ సాధారణ సమావేశం నిర్వహించే ఉద్దేశం బీజేపీ కార్పొరేటర్లకు లేదన్నారు. సమస్యలకు సమాధానం చెప్పేందుకు తాను, అధికారులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. బీజేపీ కార్పొరేటర్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. సభ సజావుగా సాగేందుకు అధికారులతో, పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడబోమన్నారు. అయితే బీజేపీ కార్పొరేటర్లకు రెండు నిమిషాలు కూడా ఓపిక లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇతర పార్టీల కార్పొరేటర్లతో వాగ్వాదానికి దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ కార్పొరేటర్ల తీరు బాగోలేదని జోనల్ కమిషనర్లు కూడా చెబుతున్నారని అన్నారు. తమను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
Gutha Sukender Reddy: కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే
