Site icon NTV Telugu

Bhatti Vikramarka: అమృత ఉత్సవాల పేరిట బీజేపీ, టీఆర్ఎస్ ప్రచార ఆర్భాటాలు విడ్డూరంగా ఉన్నాయి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎలాంటి పాత్రలేని బిజెపి, టీఆర్ఎస్ దేశం కోసం పోరాడి స్వాతంత్రం తెచ్చినట్టుగా అమృత ఉత్సవాల పేరిట ప్రచార ఆర్భాటం చేయడం విడ్డూరంగా ఉందని సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ, నెహ్రూ వారి కుటుంబ సభ్యులైన సోనియా, హుల్ ను బీజేపీ అవమానించడం స్వాతంత్రాన్ని అవమానించినట్లే అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని పట్టపగలు దారుణంగా హత్య చేసిన నారహంతకుడు గాడ్సే బీజేపీ నాయకులకు ఎలా నాయకుడు అయ్యాడో? ధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసారు.

read also: Jagadish Reddy: త్వరలో టీఆర్ఎస్ లో భారీ వలసలు ఉంటాయి

మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ మతం పేరిట దేశాన్ని విభజన చేసి మత ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ సృష్టించిన సంపదను అంబానీ, ఆదానీలకు దారా దత్తం చేస్తూ, మన దేశాన్ని, భవిష్యత్తును ప్రధాని మోడీ బహుళ జాతి సంస్థలకు తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు. మోడీ చేస్తున్న అకృత్యాలను స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మీరు కూడా చూస్తూ ఊరుకుంటారా? స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తితో తెగబడి పోరాటం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఈ.డి, ఐ.టీ, సి బి ఐ, పోలీస్ కేసులతో భయభ్రాంతులను గురిచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేసిన మోడీ పరిపాలన ఈ దేశానికి అవసరమా? నవతరమా ఆలోచించండి. యువతరమా కదం తొక్కండి అంటూ పిలుపు నిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్‌ చేసారు.
Komatireddy Venkat Reddy: మునుగోడు ఉప ఎన్నికలు.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన నిర్ణయం…

Exit mobile version