Site icon NTV Telugu

ఈటల రాజేందర్‌కు చేదు అనుభవం!

హుజురాబాద్ ఉపఎన్నికకు ఇంకా సమయం వున్నా ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర పేరుతో నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమములో ఈటలకు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలోని వీణవంక మండలం ఎలబాక గ్రామంలో ప్రజలు ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈటల పంపిన గోడగడియారాలను గ్రామస్తులు పగలకొట్టారు. ఈటల తమ గ్రామములో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని కేసీఆర్ కే తమ ఓటు వేస్తామంటూ నినాదాలు చేశారు. ఎలబాక కాలనీ వాసులందరూ కలిసి కారు గుర్తుకు ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఇక ఇల్లందకుంటలో పాదయాత్ర చేస్తున్న ఈటలకు షాక్ తగిలింది. ఇల్లందకుంట మండలం ఎంపీపీ పావని, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, ముగ్గురు సర్పంచ్‌లు.. మండల ఇంచార్జ్, ఎమ్మెల్యే రవి శంకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

Exit mobile version