Komatireddy Venkatreddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 45 రోజుల్లో అసెంబ్లీ రద్దు కానుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రూపు రాజకీయాలు చేయవద్దని కార్యకర్తలను కోరారు. నియోజకవర్గాల్లో ఇద్దరు సమాన స్థాయి నాయకులు ఉంటే ఒకరికి ఎమ్మెల్యే టికెట్, మరొకరికి ఎమ్మెల్సీ లేదా జెడ్పీ చైర్మన్ ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. ప్రతి పార్టీలో గ్రూపులు ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసి పనిచేస్తున్నారని అన్నారు.
Read also: New Delhi: సత్యేంద్ర జైన్ కు మధ్యంతర బెయిల్ పొడిగింపు.. సుప్రీంకోర్టు ఆదేశాలు
ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్‌లో గుత్తా సుఖేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి కడుపులో కత్తులు పెట్టి పొడుచుకోవడానికి సిద్దంగా ఉన్నారని. బీఆర్‌ఎస్‌లోనూ గ్రూపులున్నాయని విమర్శించారు. పీసీసీ రాకపోవడంతో సీనియర్ నాయకుడిగా కొన్ని రోజులు బాధపడ్డ మాట వాస్తవమేనన్నారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఏ కార్మికుడికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు. ఏ పదవి అయినా ఒక్కటేనని అన్నారు. తెలంగాణలో నాలుగు కోట్ల మందికి మేలు జరుగుతుందని చెప్పిన సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పదో తేదీ వచ్చిన కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు.
Teachers Strike: దంపతుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్.. బోనాలతో ప్రత్యేక ర్యాలీ..