Site icon NTV Telugu

Bhatti Vikramarka: అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి..

Bhatti

Bhatti

Bhatti Vikramarka: అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజల జీవన స్థితిగతుల్లో వస్తున్న మార్పులు, జీవన ప్రమాణాల పెరుగుదలకు సూచికలు నమోదు చేయడంలో ప్రణాళిక శాఖ కీలకపాత్ర వహిస్తుందని భట్టి వివరించారు. ఈశాఖలో పనిచేసే అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయన్నారని తెలిపారు.. ప్రభుత్వ ఆలోచన సరళికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుత సంక్షేమ రాజ్యాంగ తీర్చిదిద్దే ప్రణాళికలు మీ శాఖ నుంచే పుట్టుకు రావాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులకు ఉద్బోధించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో కలిసి ప్రణాళిక శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రణాళిక శాఖ అధికారులు నిర్వహిస్తున్న విధులు, తయారు చేసే ప్రణాళికలు, సేకరించే గణాంకాల వివరాలను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి భట్టి విక్రమార్కకి వివరించారు.

Read also: CM Mamata Banerjee : బెంగాల్ దేశాన్ని నడిపిస్తుంది : సీఎం మమతా బెనర్జీ

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రణాళిక శాఖ కీలకమన్నారు. ప్రణాళిక శాఖ రూపొందించే ప్రణాళికలు అభివృద్ధికి దిక్సూచి అవుతాయన్నారు. గణాంకాలను ఢాంభీకాలకు పోకుండా వాస్తవాలకు దగ్గరగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు ద్వారా సమాజంలో వస్తున్న మార్పులను శాస్త్రీయంగా అంచనా వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరును అమలు చేసే సంక్షేమ పథకాల సరళిని లెక్కలు కట్టే ప్రణాళిక శాఖ నివేదికలు తయారీలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజల జీవన స్థితిగతుల్లో వస్తున్న మార్పులు, జీవన ప్రమాణాల పెరుగుదలకు సూచికలు నమోదు చేయడంలో ప్రణాళిక శాఖ కీలకపాత్ర వహిస్తుందని వివరించారు. ఈశాఖలో పనిచేసే అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. జంట నగరాల్లో 2014 ముందు ఉన్న చెరువులు, నీటి కుంటలు ఎన్ని? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎన్ని చెరువులు అన్యా క్రాంతమయ్యాయి? ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఏంటి అన్నదానిపై ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Rinku Singh Six: రింకూ సింగ్‌ పవర్‌ఫుల్ షాట్.. బాక్సులు బద్దలు! వీడియో వైరల్

Exit mobile version