NTV Telugu Site icon

Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు మరోసారి వైద్య పరీక్షలు.. పాదయాత్రకు బ్రేక్‌..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కుకు మరోసారి వైద్య పరీక్షలు చేశారు వైద్యులు. 97వ రోజు పాదయాత్ర చేస్తున్న సమయంలో వడదెబ్బకు గురై తీవ్ర జ్వరంతో బాధపడుతున్న భట్టి విక్రమార్కకు ఈ రోజు మరోసారి వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. సీఎల్పీ నేత అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం జరగాల్సిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను రద్దు చేశారు.. వైద్యుల సూచన వరకు ఈరోజు కూడా జరగాల్సిన పాదయాత్రను రద్దు చేశారు.. కొద్దిసేపటికి కేతపల్లి పాదయాత్ర శిబిరానికి వచ్చిన వైద్య బృందం సీఎల్పీ నేతకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. భట్టి విక్రమార్క ఆరోగ్యం నిలకడగా ఉందని.. డిహైడ్రేషన్, జ్వరం, నీరసంతో భట్టి విక్రమార్క ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. విశ్రాంతి అవసరమని వైద్యలు సూచించారు. వైద్యుల సూచనల మేరకు భట్టి పాదయాత్రకు నిన్న, ఈరోజు బ్రేక్‌ పడింది. అయితే పాదయాత్ర మళ్లీ ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేది త్వరలో ప్రకటిస్తామని కాంగ్రెస్‌ శ్రేణులు తెలిపారు.

Read also: Miheeka Bajaj: మైండ్ బ్లాక్ చేస్తున్న రానా వైఫ్ లేటెస్ట్ ఫొటోస్..

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. నకిరేకల్ మండలం కేతపల్లిలో లంచ్ విరామ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో విక్రమార్కకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ప్రమాదకరమైన ఎండలో పాదయాత్ర చేయడం వల్ల బాడీ డీహైడ్రేట్ అయి.. షుగర్ లెవల్స్ తగ్గిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్కకు విశ్రాంతి అవసరమని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ ఉమ్మడి 7 జిల్లాల్లో కొనసాగనుంది. దాదాపు 1365 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరగనుంది.
Parks Closed: రేపు హైదరాబాద్‌లో పార్కులు బంద్‌.. హెచ్ఎండీఏ అధికారులు వెల్లడి