Site icon NTV Telugu

Bhatti Vikramakra : తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramakra : ఖమ్మం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని, శైలంపైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టమన్నారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది నీటి ప్రాజెక్ట్ ల కోసమే అని, దురదృష్టం పదేళ్ల పాటు కృష్ణ, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్ట్ లు కట్టలేదన్నారు. గోదావరి నుంచి పూర్తి గా దిగువకు నీళ్లు వదులుతారని, కృష్ణ మీద పైన ఆంధ్రా వాళ్ళు నీళ్లు తీసుకుంటారన్నారు భట్టి విక్రమార్క.

Srushti Test Tube Baby Centre: సృష్టి ఫెర్టలిటి సెంటర్ కేసులో మరొకరి అరెస్ట్

కృష్ణ మీద కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ చేసిన నిర్మాణాలే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్ లు కొన్ని పూర్తిచేయలేదని, రోజుకు 13 TMC ల నీరు శ్రీశైలం పైన తీసుకునే విధంగా ప్లాన్ చేశారని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆపలేక పోయిందని, దీనిని ముందే హెచ్చరించి పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చానన్నారు. ఆరోజులలో మమ్ములను అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు.

సాగర్ నుంచి ఒక్క టీఎంసీ వస్తుండగా మనం మంచి పంటలు పండిస్తున్నామని, 13 రెట్లు టీఎంసీల నీటిని తీసుకుని విధంగా ఏపీ ప్లాన్ చేస్తుందని, దీనివల్ల శ్రీశైలం ఖాళీ వెంటనే అవుతుందన్నారు. శ్రీశైలం నిండక పోతే మన ప్రాజెక్టులకు చాలా కష్టమని, చివరకు హైదరాబాద్ కు కూడా మంచి నీళ్లు కూడా కష్టమన్నారు భట్టి విక్రమార్క. గోదావరి పై ప్రాజెక్ట్ లు పూర్తి అయితే 25 లక్షల ఎకరాలు సాగు అయ్యేవని, కేసీఆర్ కాంగ్రెస్ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ లు వదిలేశాడన్నారు. కాళేశ్వరం ఒక్క ప్రాజెక్ట్ కట్టిన ఒక్క ఎక్కరం కూడా నీళ్లు ఇవ్వలేకపోయినా కేసీఆర్, ఆ కాళేశ్వరం కుంగిపోయిందని మండిపడ్డారు.

POCSO Case : పోక్సో కేసులో తెలుగు కొరియోగ్రాఫర్ అరెస్ట్ – పరిశ్రమలో కలకలం

Exit mobile version