NTV Telugu Site icon

Bhatti Vikramarka: 5 నెలల్లో కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుంది

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka Speech In Congress People March Public Meeting: తెలంగాణ రాష్ట్రంల్లో 5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు తాము ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సభకు తరలివచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ పిప్పిరి నుండి జడ్చర్ల వరకు 800 కిలోమీటర్ల మేర తాను పాదయాత్ర కొనసాగించానని చెప్పారు. ఈ పీపుల్స్ మార్చ్ రాజకీయాల కోసమో, ఎన్నికల కోసమో ఏర్పాటు చేసింది కాదని.. ప్రజాస్వామ్యం కోసమని అన్నారు. అయితే.. ఈరోజు దేశ ప్రజాస్వామ్యం కూని అయ్యిందని, ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడితే కష్టాలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. కర్ణాటక ప్రజలు మాత్రం తమ రాష్ట్రం నుంచి బీజేపీని తరిమికొట్టి, ప్రజాస్వామ్యాన్ని బతికించారని వ్యాఖ్యానించారు. మీరు (బీజేపీని ఉద్దేశించి) రాహుల్ గాంధీని ఇంటి నుండి ఖాళీ చేయిస్తే, కర్ణాటక ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపారంటూ కౌంటర్ వేశారు.

Worst Traffic: ప్రపంచంలో అత్యంత చెత్త ట్రాఫిక్ కలిగిన టాప్-10 నగరాలు

సోనియమ్మ తెచ్చిన ఫారెస్ట్ యాక్ట్‌ను తీసేసి, అడవి బిడ్డలను కష్ట పెడుతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ధరణి మహమ్మారి పేరుతో భూములు లాక్కుంటే.. మేము ఎవరికి చెప్పుకోవాలని అడవి బిడ్డలు ఆవేదన చెందుతున్నారన్నారు. ఇంద్రవెల్లి కుమ్మరి తాండాలో అడవి బిడ్డలను బయటకు వెళ్లమంటూ తెలంగాణ రాష్ట్ర ఫ్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఆరోపణలు చేశారు. ఆనాటి ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడం కోసం మీవెంట మేముంటామంటూ అడవి బిడ్డలు తమకు హామీ ఇస్తున్నారని తెలిపారు. సింగరేణి బొగ్గు బావులను కాపాడమంటూ కార్మికులు ఆవేదన చెందుతున్నారని, అలాగే రాష్టంలో నిరుద్యోగులు తమకు భరోసా లేదని కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ రూ.5 వేల కోట్ల విలువైన భూములను పంపిణీ చేస్తే.. ఆ భూముల్ని తెలంగాణ ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఫ్రభుత్వం 24 లక్షల ఎకరాలు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు పంచిందని గుర్తు చేశారు. మీకోసం మేము మీ వెంటే ఉంటామని భరోసా కల్పించిన ఆయన.. 5 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్మకం వెలిబుచ్చారు.

పెళ్ళికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించిన స్టార్స్ వీరే..

తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. భూములు పంచడంతో పాటు ధరణి భూతాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని భట్టి విక్రమార్క ప్రకటించారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల పేరిట ముంపు గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 2013 చట్టాన్ని అమలుపరచాలని ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారని చెప్పారు. గతంలో కట్టిన ప్రాజెక్టులతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా తాము ప్రారంభిస్తామన్నారు. ఉచిత రేషన్ బియ్యంతో పాటు ఇంటి సరుకులు ఇస్తామని, గ్యాస్ బండను రూ.500కే ఇస్తామని హామీ ఇచ్చారు. ఫ్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల ఉద్యాగాలను కల్పిస్తామని.. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మాటిచ్చారు. అలాగే.. మహిళా మండలాలకు 2లక్షల రూపాయలు రుణ మాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు.

Show comments