NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇళ్లకు శంఖుస్థాపనలు చేస్తాం..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇళ్లకు శంఖుస్థాపనలు చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశ సంపద ను మోడీ పెట్టుబడి దారులకు పంచి పెడుతున్నారని అన్నారు. నామా నాగేశ్వర రావు ఏ పార్టీ నుంచి మంత్రి అవుతారు? అని ప్రశ్నించారు. పది మంది పోటీ చేయని మీరు ఒక్క సీట్ కూడా గెలవని బీఆర్ఎస్ నుంచి నామా ఎలా మంత్రి అవుతారన్నారు. దేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ వుండదన్నారు. దాని గురించి భయపడేది లేదని తెలిపారు. కార్ షెడ్ నుంచి ఇక బయటకు రాదన్నారు. ఓట్లు అడుగడం వరకే కాదన్నారు. కాంగ్రెస్ గతంలో ఎలా సేవ చేసింది భవిష్యత్ లో కూడా అలా సేవ చేస్తామన్నారు. 1400 కోట్ల తో కావల్సిన ప్రాజెక్టు లను వేల కోట్లు వెచ్చించి ఒక్క చుక్క నీరు రాకుండా చేసిన చరిత్ర కేసీఆర్ ది అన్నారు. కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాలు కూడా అందిస్తామన్నారు.

Read also: Chandrababu: కల్లూరు సభలో భూహక్కు పత్రాన్ని తగలబెట్టిన చంద్రబాబు

ధనిక రాష్ట్రంను మీ చేతిలో పెడితే ఒక్క నెల కూడా మొదటి నెల జీతం ఇవ్వలేని ప్రభుత్వం కేసీఆర్ అన్నారు. మేము అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి అందరికీ జీతాలు ఇస్తున్నామన్నారు. కాకి అరిచినట్లు గా రైతు బందు ఇవ్వలేదు అని అంటున్నారని తెలిపారు. సోయి వుండి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. 65 లక్షల మందికి రైతు బందు వేశాం… మిగిలిన వారికి వేస్తున్నామన్నారు. అబద్దాల పునాదుల మీద బ్రతికిన బీఆర్ఎస్ .. అధికార పార్టీ మీద బురద చల్లడం కేసీఆర్ లక్ష్యం అన్నారు. బాష మార్చుకో కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేకుండా మాజీ ముఖ్యమంత్రి హోదా లో ఏమిటా మాటలు అన్నారు. దద్దమ్మలు, సన్నాసులు అంటే చూస్తూ ఊరుకోమన్నారు. నువ్వు చేసిన దోపిడీ సొమ్ము తోటే మేము గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామన్నారు. కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇళ్ల కు శంఖుస్థాపనలు చేస్తామన్నారు.
Dhanush : మరో తెలుగు దర్శకుడితో ధనుష్ మూవీ..?

Show comments