NTV Telugu Site icon

Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో లక్ష్మీపురం గ్రామంలో భట్టి ప్రచారం నిర్వహించారు. రైతు బంధుకు ఈసీ ఆంక్షలు విధించడం.. కేసీఆర్ తీరుపై భట్టి స్పందించారు. రైతు బంధు ఇప్పుడు మొదలు పెట్టింది కాదని అన్నారు. నోటిఫికేషన్ వస్తే రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రైతు బంధు నిధులు ఎందుకివ్వలేదు..? అని ప్రశ్నించారు. రైతు బంధు నిధుల విషయంలో నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎందురు ఆగారు..? అంటూ సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. ముందే రైతు బంధు నిధులు వచ్చుంటే రైతులకు ఆ డబ్బులు చేరేవి కదా..? అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పేదలకు ఎంతో మేలు జరుగుతోందని స్పష్టం చేశారు. తొలి కెబినెట్ లోనే గ్యారెెంటీలను అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

Read also: Karthika Pournami 2023: కార్తిక పౌర్ణమి.. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిట

మధిర పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిన్న కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ప్రజాశక్తిపై విశ్వాసం ఉండగా బీఆర్‌ఎస్‌ పాలకులు ఎన్నికల్లో కరెన్సీ నోట్ల మూటలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా ప్రజల ఆస్తులను దోపిడీ చేసిన బీఆర్‌ఎస్‌ పాలకులు.. వచ్చే ఐదేళ్లు దోచుకునేందుకు ఈ ఎన్నికల్లో డబ్బు వృథా చేశారని ఆరోపించారు. ప్రజలు దీనిపై దృష్టి సారించి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మదీరా నియోజకవర్గాన్ని వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యా, వైద్య సంస్థల ఏర్పాటుపై చర్చ జరిగింది. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించనున్న భట్టి విక్రమార్కకు వీలైనన్ని ఎక్కువ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కి మధిర నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు , ఎర్రుపాలెం మండలం గుంటుపల్లి గోపారం గ్రామంలో ఘన స్వాగతం పలికారు. వేలాది వాహనాలతో ర్యాలీ బనిగందలపాడు, ఎర్రుపాలెం, మీనవోలు, దెందుకూరు, మధిర, ఆత్కూరు క్రాస్ రోడ్డు, బోనకల్ క్రాస్ రోడ్డు మీదుగా ఆత్కూరు, కలకోట సిరిపురం గ్రామాల మీదుగా గుంటుపల్లి గోపారం చేరుకుంది. అక్కడి నుంచి ఈ బైక్ ర్యాలీ వైరా అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
Gangs of Godavari : విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ అప్పుడేనా..?