Site icon NTV Telugu

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎంగా భట్టి బాధ్యతలు.. నిధులు మంజూరు చేస్తూ సంతకాలు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: సచివాలయంలో ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్‌ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే భట్టి మూడు శాఖలకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తు సంతకాలు చేశారు. మూడు శాఖలకు సంబంధించిన నిధులు డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖ భట్టి విక్రమార్క విడుదల చేశారు. శాఖలకు నిధులు మంజూరు చేస్తూ భట్టి సంతకాలు చేశారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సబ్సీడీ నిధుల విడుదల చేశారు. రూ.374 కోట్లను మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.298 కోట్లు, విద్యుత్‌ సబ్సిడీకి రూ.996 కోట్లు, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లు విడుదల చేశారు.

Read also: Mohammed Shami: నా కంటే ఏ క్రికెటర్ ఎక్కువ బరువు ఎత్తలేడు.. కానీ చెప్పుకోను: మహమ్మద్ షమీ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ప్రసాద్ కుమార్ ఎన్నిక అయినట్టు స్పీకర్ ప్రోటెమ్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఆయనను స్పీకర్‌ చైర్‌ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కేటీఆర్‌, కడియం శ్రీహరితోపాటు అన్నిపార్టీలకు చెందిన సభ్యులకు స్పీకర్‌ను అభినందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా.. కడియం శ్రీహరి, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మా రావు గౌడ్ ,పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా దినసరి అనసూయ సీతక్క నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి లతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ హనుమంత రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్ వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.
West Bengal : బట్టీ కార్మికులపై పడిన చిమ్నీ.. ముగ్గురి మృతి.. 30మందికి గాయాలు

Exit mobile version