Bharat Jodo Yatra: భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ స్వయంగా పాదయాత్రకు పూనుకోవడం పార్టీకి బూస్ట్ ఇస్తుందనే అంచనాలుపెరిగాయి. సెప్టెంబర్ 7 నుంచే రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలైంది. 117 మంది కాంగ్రెస్ నాయకులతో కలిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ ఐదు నెలలు పాదయాత్ర చేస్తారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసేలా రూట్‌మ్యాప్ రూపొందించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంతో కర్ణాటక, ఏపీ అనంతరం భారత్ జోడో యాత్ర నిన్న తెలంగాణకు చేరింది.
Read also:Bumper Offer: నాన్‌వెజ్ ప్రియులకు బంపరాఫర్.. మటన్ కొంటే చికెన్ ఫ్రీ..!
కృష్ణా నది బ్రిడ్జి మీదుగా తెలంగాణలోని మక్తల్ లోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు పార్టీ నాయకులతోపాటు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతంతో తెలంగాణలో పాదయాత్ర మొదలుపెట్టిన రాహుల్ గాంధీ దారి పొడవునా స్థానికులను పలుకరిస్తూ యాత్ర నిర్వహించారు. కుశల ప్రశ్నలు వేస్తూ.. క్షేమ సమాచారాలు… సమస్యలు అడిగి తెలుసుకుంటూ స్థానికులతో మమేకం అయ్యారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి శంషాబాద్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల తర్వాత గ్యాప్ తర్వాత ఈ నెల 27 న తిరిగి రాష్ట్రంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు దీపావళి పండుగ సందర్భంగా 3 రోజులు విరామం ప్రకటించారు. ఈనెల 26న AICC కార్యాలయంలో జరిగే ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తిరిగి ఈనెల 27న ఉదయం 6గంటలనుండి తెలంగాణలో యాత్రను ప్రారంభిస్తారు. తెలంగాణలో వచ్చే నెల 8వ తేదీ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది.
TTD : రికార్డు స్థాయిలో తిరుమలేశుడి హుండీ ఆదాయం