NTV Telugu Site icon

Bharat Jodo Yatra: నగరానికి చేరుకున్న భారత్ జోడో యాత్ర.. అక్కడ ట్రాఫిక్‌ మళ్లింపు

Bharath Judo Yatra Rahulgandhi

Bharath Judo Yatra Rahulgandhi

Bharat Jodo Yatra: నేడు హైదరాబాద్‌లోకి రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆపార్టీ యువనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర నేడు నవంబర్‌ 1వ తేదీన హైదరాబాద్‌ సిటీలోకి ప్రవేశించింది. శంషాబాద్‌ నుంచి భారత్‌ జోడో యాత్రం మొదలైంది. మధ్యాహ్నం వరకు శంషాబాద్‌ మీదుగా ఆరాంఘర్‌ చేరుకోనుంది. రాజేంద్రనగర్‌ నుంచి శేరలింగంపల్లి వరకునగరంలోని ఏడు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు కొనసాగనున్న యాత్రకు దారి పొడుగునా స్వాగతం పలికేందుకు జెండాలు, ప్లెక్సీలు కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇందిరా గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ పబ్లిక్ మీటింగ్ ఉంటుందని, పాదయాత్ర జరిగే 3కిలో మీటర్ల రేడియస్ లో ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలన్నారు. ఉదయం నుంచి 10.30 గంటలకు వరకు ఆరాంఘర్‌ నుంచి తాడ్‌బండ్‌ వరకు యాత్ర కొనసాగనుంది. లంచ్‌ బ్రేక్‌ తరువాత సాయంత్రం 4గంటలకు పూరానాపూల్‌ దగ్గర నుంచి యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4.30 గంటలకు చార్మినార్‌ కు చేరుకోనున్న రాహుల్, సాయంత్రం ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర సభ నిర్వహించనున్నారు.

ఇవాల్టి నుంచి రెండు రోజుల పాటు సాగనున్న రాహుల్‌ జోడో యాత్రను పురస్కరించుకుని పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఇక, సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో రెండు రోజుల పాటు యాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. నేడు ఆరాంఘర్‌, బహదూర్‌ పూర, చార్మినార్‌, అఫ్జల్‌ గంజ్‌, మొజాంజాహి మార్కెట్‌, గాంధీభవన్‌, నెక్లెస్‌ రోడ్‌ వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 వరకు వరకు యాత్ర జరిగే సమయంలో ట్రాఫిక్‌ను ఇతర ప్రాంతాలకు మళ్లించనున్నారు. నవంబర్‌ 2న సనత్‌ నగర్‌, బోయినపల్లి, బాలానగర్‌, మూసాపేట, కూకట్‌ పల్లి, మియాపూర్‌ వరకు ఉదయం 6గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆయా తేదీల్లో యాత్ర జరిగే మార్గంలో వాహనదారులు ట్రాఫిక్‌ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు.