దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అద్భుతమైన మౌలిక వసతులతో ఏర్పాటయ్యే ఈ నగరాన్ని 13,500 ఎకరాలలలో జీరో కార్బన్ సిటీగా రూపొందించనున్నట్టు తెలిపారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ, యాజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ 3 ట్రిలియన్ డాలర్స్ తెలంగాణా’ అనే అంశంపై ప్రభుత్వ ప్రణాళికలను మంగవారం నాడు ఆయన గ్లోబల్ సమ్మిట్ లో వివరించారు. భవిష్యత్ నగరాన్న ఆరు అర్బన్ జిల్లాలుగా అభివృద్ధి చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ సిటీ, ఎంటర్ టెయిన్ మెంట్, క్రీడలు, డేటా సెంటర్స్, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థల జిల్లాలుగా మొత్తం ఆరింటిని నెలకొల్పనున్నట్టు శ్రీధర్ బాబు చెప్పారు.
ఇక్కడ ఏర్పాటయ్యే వివిధ పరిశోధన సంస్థలు, గ్రీన్ ఫార్మా, మ్యాన్యుఫాక్చరింగ్, ఎంటర్ టెయిన్ మెంట్ జోన్ల ద్వారా మొత్తం 13 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. 9 లక్షల జనాభా కోసం నివాస గృహాల సముదాయాలు ఏర్పాటు చేస్తాం. నిర్మాణరంగంలో ఉన్నవారు వీటిని అభివృద్ధి చేస్తారు. మరో నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. డేటా సెంటర్ల కోసం 400 ఎకరాలు కేటాయిస్తున్నాం. వచ్చే ఫిబ్రవరి చివరలో ఇక్కడ నిర్మాణాలు మొదలవుతాయి.
Deputy CM Pawan Kalyan: రెండు దశాబ్దాల రోడ్డు వెతలకు పరిష్కారం చూపిన పవన్ కల్యాణ్..
ఎంటర్ టెయిన్ మెంట్ జోన్ (డిస్ట్రిక్ట్ ) లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కన్ వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అడ్వెంచర్ కేంద్రాలు, స్టార్ హోటళ్లు నిర్మిస్తాం. ఫ్యూచర్ సిటీ అంతా ఒక ఆర్కిటెక్చరల్ అద్భుతంగా నిలుస్తుంది. భవిష్యత్తు అవసరాలకు సరిపోయే అత్యాధునిక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అర్భన్ ఫారెస్టులతో అంతా పచ్చదనం పర్చుకుని కనిపిస్తుంది. వన్ తారా (vantara) వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ జీరో కార్బన్ సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరంగా భాసిల్లుతుంది. ఇక్కడ కురిసే ప్రతి వర్షం చుక్క ఇక్కడే ఇంకిపోయేలా రెయిన్ హార్వెస్టింగ్ జరుగుతుంది. భూగర్భ జలాలకు కొదవ లేకుండా చేస్తాం. లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో నూతన పరిశోధనలు, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు ఉంటాయి.
KA Paul: మీరు వీవీవీఐపీ కావొచ్చు.. నేను అంతకంటే వీవీవీఐపీని.. కేఏ పాల్ వార్నింగ్..