Seetha Rama Kalyanam: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురష్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జల్లి భద్రాద్రి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం వైభవంగా నిర్వహించారు ఉదయం 10.30 గంటల నుంచి మొదలైన ఈ వేడుక మధ్నాహ్నం 12.30 గంటల వరకు జరపనున్నారు. సీతారాముల స్వామి వారి కళ్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈనేపథ్యంలో మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కల్యాణ మండపాన్ని అలంకరించారు. అభిజిత్ లగ్నంలో రామయ్య సీతమ్మ ఒక్కటయ్యారు. వేదమంత్రోచ్ఛరణల నడుమ సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ చేశారు. సీతారాముల కల్యాణోత్సవ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీలు రవిచంద్ర, కవిత తదితరులు పాల్గొన్నారు.
Read also: Mayor of Ballari: 23 ఏళ్లకే మేయర్ పదవి.. చరిత్ర సృష్టించిన త్రివేణి
జగదభి రాముని కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాములోరిని కనులారా వీక్షించి పులకించేందుకు తరలివచ్చే భక్తజనం కోసం ప్రభుత్వం సలక ఏర్పాట్లు చేసింది. వేసవి దృష్ట్యా మిథిలా మైదానంలో చలువ పందిళ్లు వేశారు. ఫ్యాన్లు, కూలర్లు అమర్చి భక్తులంతా క్చూర్చుని వీక్షించేలా ఏర్పాటు చేశారు. మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. సుమారు 2వేల మందికి పైగా పోలీసులు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. లోక కల్యాణంగా భావించే రాములోరి కల్యాణాన్ని కన్నులారా వీక్షించి భక్తులు పులకించారు. శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియంతో పాటు, భద్రాద్రి పుర వీధులు మార్మోగుతున్నాయి.
Taiwan President: చూస్తూ ఊరుకోబోం.. తైవాన్‌కు చైనా తీవ్ర హెచ్చరికలు
