NTV Telugu Site icon

Minister KTR: నేడు భద్రాద్రిలో కేటీఆర్‌ పర్యటన.. రామాలయ దర్శనం, రోడ్ షో

Minister Ktr

Minister Ktr

Minister KTR: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో ఉదయం భద్రాచలం నగరానికి చేరుకుంటారు. 11 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం ఉంటుంది. అనంతరం బీఆర్ ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి తైలం వెంకట్రావు విజయాన్ని కాంక్షిస్తూ నగరంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇల్లెందు నగరానికి చేరుకుంటారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరిప్రియానాయక్‌ విజయాన్ని కాంక్షిస్తూ అక్కడ రోడ్‌ షో నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా కేంద్రం కొత్తగూడెం చేరుకుంటారు. అక్కడ బీఆర్ ఎస్ అభ్యర్థి వన్మా వెంకటేశ్వరరావు గెలుపు కోసం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అశ్వారావుపేటకు చేరుకుంటారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షోలో పాల్గొంటారు. బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన ముగిసిన కొద్ది రోజులకే మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారానికి రావడంతో పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొంది. కాగా, మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ మధు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలు ప్రజలతో ముఖాముఖి అన్నట్లుగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ నేతృత్వంలో జరుగుతున్న రోడ్ షోలకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చి ప్రసంగాలు వింటున్నారు. కేటీఆర్ చెప్పిన దాని గురించి ఆలోచించి మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు సిద్ధమవుతున్నారు. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి నుంచి నిన్న రోడ్ షో నిర్వహించారు. ఓపెన్‌టాప్ బస్సులో పలు గ్రామాల ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. , కామారెడ్డి నుంచి కేసీఆర్ రాక సందర్భంగా రానున్న ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి ఏం జరుగుతుందో చెప్పారు
Bigg Boss 7 Telugu: ఎలిమినేషన్‌ ఎత్తేసిన బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురి కోసమేనా?