భద్రాచలం నియోజకవర్గ బీజేపీలో ముసలం మొదలైందా? జిల్లా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడిపై మాజీ ఎంఎల్ఎ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆమె ఆడియో వైరల్ అవుతోంది. నేతలు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని సత్యవతి ఆరోపణలు చేశారు. గోదావరి వరదల సందర్బంగా భద్రాచలం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటనలు, నిత్యవసర వస్తువుల పంపిణి వ్యవహారంలో పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని భద్రాచలం మాజీ ఎంఎల్ ఎ బీజేపీ నేత సత్యవతి మాట్లాడిన ఆడియో క్యాసెట్ బయటకు వచ్చింది. గతంలో కాంగ్రెస్ నుంచి గెలుపొంది ఆ తరువాత బీజేపీలో చేరిన సత్యవతి పట్ల ఆ పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఫోన్ లో మాట్లాడుతున్న ఆడియో రికార్డు వివాదం అవుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన జిల్లా అధ్యక్షుడుగాఉన్న కోనేరు చిన్ని అదే విధంగా ఆ పార్టీకి జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పట్ల ఆమె ఫోన్ లో మాట్లాడిన ఆడియో ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి ఆ ఆడియో క్యాసెట్ లో ఎక్కువ సేపు మాట్లాడారు సత్యవతి. పార్టీనుంచి వచ్చిన దుప్పట్లను కనీసం పంచలేదని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆమె మాట్లాడిన ఆడియో బయట పడింది. అదేవిధంగా పై నుంచి వచ్చిన నేతలు కూడా వారికే మద్దతు ఇస్తున్నారని వారి పట్ల కూడా ఆమె మాట్లాడిన అంశాలు వివాదానికి కారణం అవుతున్నాయి.
మాజీ ఎంఎల్ ఎ బీజేపీ నేత సత్యవతి వివాదాస్పద ఆడియో వ్యాఖ్యలు బీజేపీలో ఆందోళన కలిగిస్తున్నాయి. పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని ఆమె అంటున్నారు. బీజేపీ నేతలతో ఫోటోలు దిగడం తప్పితే మరేమి చేసేది లేదంటున్నారు. పార్టీ నాయకులు బైరెడ్డి పార్టీకి చెందిన నిత్యావసర వస్తువులు ఇస్తే వాటిని పంపిణి చేయడం లేదని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోచోటపేకాట ఆడుకుంటూ కోనేరు చిన్ని ఉంటాడని ఆమె చెబుతోంది. నియోజకవర్గంలో బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎర్రం రాజుల పెత్తనం ఏమిటని ఆమె మండిపడుతోంది. దీనిపై అధిష్టానం ఏంచేస్తుందోనని బీజేపీ క్యాడర్ ఎదురుచూస్తోంది.
Fire Accident : ఏషియన్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయలు నష్టం
