WhatsApp scam: ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నా.. సైబర్ నేరగాళ్లు మాత్రం రోజుకో కొత్త మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్న పొరపాటు జరిగినా ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరాలకు తెరతీస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తూ దోచుకుంటున్నారు. దేశంలో సైబర్ మోసాలు ప్రబలంగా ఉన్నాయి. సైబర్ మోసగాళ్ళు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, ఈ వాణిజ్య సైట్‌లను వదలకుండా నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు అర్థంకాని రీతిలో ఇరుకున పెట్టి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరాలు నేడు ప్రధాన సమస్యగా మారడంలో ఆశ్చర్యం లేదు. సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా మోసానికి గురవుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు మోసగాళ్లు అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఇప్పుడు మరో కొత్త తరహా మోసానికి తెరతీశారు. అందుకు వాట్సాప్‌ను ఆయుధంగా ఎంచుకున్నారు. ఇతర దేశాల నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. వరుసగా కాల్స్ చేస్తూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Read also: KTR tour in UK: క్యూలో నిల్చున్న కేటీఆర్.. ఆసక్తిగా వీక్షించిన ప్రయాణికులు
అంతర్జాతీయ నంబర్ల నుంచి పదే పదే కాల్స్ రావడం చికాకు కలిగిస్తోంది. ఉద్యోగావకాశాలు, లాటరీలు, రుణాలు, టాస్క్‌ల పేరుతో వాట్సాప్ వినియోగదారులను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అమ్మాయిల పేర్లు, డీపీలతో ప్రలోభపెట్టే ఎత్తుగడలు వేస్తున్నారు. ముచ్చటగా మాట్లాడుతూ.. సైబర్ దాడి చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. మలేషియా, ఇథియోపియా, వియత్నాం, బ్యాంకాక్ వంటి దేశాల ఐఎస్‌డి కోడ్‌లతోనే ఈ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్‌లు, మెసేజ్‌లు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఫారిన్ కోడ్స్ ఉన్న ఫోన్లు వస్తే పెద్ద మోసమని లిఫ్ట్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ నంబర్ల ద్వారా సైబర్ మోసాలకు గురవుతున్నామని కొందరు స్కామర్లు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. అమ్మాయిలే ఎక్కువగా ఈ కాల్స్ టార్గెట్‌గా వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి అమ్మాయిల పేరుతో మెసేజ్ లు, వీడియో కాల్స్ వస్తున్నాయంటూ ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇతర దేశాల కోడ్‌లతో ఫోన్ వచ్చినంత మాత్రాన అది అంతర్జాతీయ కాల్ కాదు. ఇలాంటి కాల్స్‌ను వెంటనే బ్లాక్ చేయాలని వాట్సాప్ వినియోగదారులకు పోలీసులు సూచిస్తున్నారు. అయితే తమ నంబర్లు సైబర్ నేరగాళ్ల చేతికి ఎలా చేరాయని వాట్సాప్ యూజర్లు తలలు పట్టుకుంటున్నారు. వరుసగా కాల్స్ చేస్తూ విసిగి వేసారిపోతున్నామని, మెసేజ్ లు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు.
Top Headlines@9AM: టాప్ న్యూస్