NTV Telugu Site icon

Bhatti Vikramarka: పార్టీ వీడొద్దని రాజగోపాల్ రెడ్డి బుజ్జగిస్తూ.. ఉన్నాం..

Rajagopal Reddy

Rajagopal Reddy

రాజగోపాల్ రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యే.. ఆయన తో నేనని, అధిష్టానం మాట్లాడిందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క స్పష్టం చేసారు. సాధ్యమైనంత వరకు పార్టీలో ఉండేలా చూస్తున్నామని అన్నారు. ప్రజలు ఉప ఎన్నికలు కోరుకోలేదు కదా..? అంటూ ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడొద్దని బుజ్జగిస్తూ ఉన్నామని భట్టి స్పష్టం చేసారు. రాజగోపాల్‌ రెడ్డితో అధిష్టానం, మాట్లాడుతుందని, మేము మాట్లాడుతూ ఉన్నామని తెలిపారు. పార్టీ లో మీకు ఉన్న ఇబ్బందులు ఏంటని రాజగోపాల్‌ ను అడుగుతున్నామని అన్నారు. తెలంగాణ లో టీఆర్‌ఎస్‌ ను ఓడించే బలం కాంగ్రెస్ కే ఉందని స్పష్టం చేసారు. కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారని, తెలంగాణ ఇచ్చిన పార్టీకి దీన్ని బాగు చేయడం ఎలా అనేది తెలుసని అన్నారు. కాంగ్రెస్ ఎవరికి, దేనికి భయపడదని అన్నారు. నోటీసులు ఇవ్వడానికి భయం కాదు, మా పార్టీ నాయకుడిని కాపాడుకోవడం కోసం తపన అంటూ భట్టి విక్రమార్క స్పష్టం చేసారు.

read also: President’s flag: ప్రెసిడెంట్స్ ఫ్లాగ్ అంటే ఏంటి?. రేపు తమిళనాడు పోలీసులకు ఇవ్వనున్న వెంకయ్యనాయుడు

కెసిఆర్ ఢిల్లీలో.. కేటీఆర్ ఇంట్లో..! అసలు పాలన ఉందా.. రాష్ట్రంలో..? అంటూ సీఎల్పీనేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎనిమిది యేండ్ల అధాయం, అప్పులు కాళేశ్వరంలో ధార పోశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. వరదకు మొత్తం మునిగిపోయిందని మండిపడ్డారు. కట్టిన వాల్స్ కూలి పోయాయని, ఎనిమిది యేండ్ల సంపదను అప్పులు, నిరుపయోగంగా మారిపోయిందని విమర్శించారు. అసలు ఏం జరుగుతుంది అనే పరిశీలనకు వెళ్తే కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. Kgf మైన్ లోకి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళే వాళ్ళ ఫోన్ లు తీసుకున్నట్టు.. కాళేశ్వరంలో ఉద్యోగులను కూడా అలాగే చేస్తున్నారని బట్టి విమర్శించారు. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి ఏం చేశారు? అని ప్రశ్నించారు. కేటీఆర్‌ ఇంట్లోనే రెస్ట్ లో ఉన్నారని ఎద్దేవ చేసారు. రాష్ట్ర అతలాకుతలం అవుతుందటే.. ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు పాలన ఉందా..? రాష్ట్రంలో అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీ సిఎల్పీ నేతగా విజిట్ చేస్తా అంటూ బట్టి అన్నారు. మా పార్టీ ఎమ్మెల్యే లంతా కలిసి వెళ్తామని తెలిపారు. అందరినీ అపినట్టు మమ్మల్ని ఆపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వరద నష్టం ఎక్కువ జరిగిందని, రైతులు దెబ్బ తిన్నారని గుర్తు చేసారు. వెంటనే శాసన సభను సమావేశ పరచాలని డిమాండ్‌ చేసారు. వరదలు, నష్టంపై చర్చ చేద్దామని పిలుపు నిచ్చారు.

HASEENA: రాహుల్ సిప్లిగంజ్ పాటను ఆవిష్కరించిన నిఖిల్!