Site icon NTV Telugu

Bathukamma Sarees: ఆడపడుచులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ..

Bathukamma Sarees

Bathukamma Sarees

Bathukamma Sarees:రాష్ట్రంలోని ఆడపడుచులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.. ప్రతీ ఏటా దసరా కంటే ముందు ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాల కంటే ముందుగానే ఆడపడుచులకు బతుకమ్మ సారే పేరుతో తెలంగాణ ప్రభుత్వం కానుకను అందిస్తున్న విషయం తెలిసిందే కాగా.. ఈ సారి కూడా చీరల పంపిణీకి సిద్ధం అయ్యింది సర్కార్.. ఈ నెల 25వ తేదీ నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. రేటి నుంచే అంటే ఈ నెల 22వ తేదీ నుంచే బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.. ఈ ఏడాది కోటి బతుకమ్మ చీరల పంపిణీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ సంవత్సరం (24) విభిన్న డిజైన్లు (10) రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం (240) రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల) తో చీరలు సిద్ధం చేశారు.. 92.00 లక్షల రెగ్యులర్ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల 8 లక్షల చీరలు సిద్ధం చేశారు.

Read Also: Dussehra Holidays: దసరా సెలవులపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ.. ఇదే ఫైనల్..

ఇక, ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్ల ఖర్చు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు నిండాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలిపారు.. ఈసారి కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు.. రేపటినుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. కాగా, రేషన్ కార్డుల ఆధారంగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.. దసరా పండుగ, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ఆడపడుచులకు చీరలు అందిస్తున్నారు. రేషన్ కార్డుల్లో పేరు ఉండి 18 ఏళ్లు పైబడి, అర్హులైన ప్రతీ మహిళకు చీరలు అందించనున్నారు.

Exit mobile version