Bathukamma Sarees: ఆడపడుచులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathukamma Sarees:రాష్ట్రంలోని ఆడపడుచులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.. ప్రతీ ఏటా దసరా కంటే ముందు ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాల కంటే ముందుగానే ఆడపడుచులకు బతుకమ్మ సారే పేరుతో తెలంగాణ ప్రభుత్వం కానుకను అందిస్తున్న విషయం తెలిసిందే కాగా.. ఈ సారి కూడా చీరల పంపిణీకి సిద్ధం అయ్యింది సర్కార్.. ఈ నెల 25వ తేదీ నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. రేటి నుంచే అంటే ఈ నెల 22వ తేదీ నుంచే బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.. ఈ ఏడాది కోటి బతుకమ్మ చీరల పంపిణీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ సంవత్సరం (24) విభిన్న డిజైన్లు (10) రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం (240) రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల) తో చీరలు సిద్ధం చేశారు.. 92.00 లక్షల రెగ్యులర్ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల 8 లక్షల చీరలు సిద్ధం చేశారు.
Read Also: Dussehra Holidays: దసరా సెలవులపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ.. ఇదే ఫైనల్..
Also Read
ఇక, ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్ల ఖర్చు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు నిండాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.. ఈసారి కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు.. రేపటినుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. కాగా, రేషన్ కార్డుల ఆధారంగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.. దసరా పండుగ, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ఆడపడుచులకు చీరలు అందిస్తున్నారు. రేషన్ కార్డుల్లో పేరు ఉండి 18 ఏళ్లు పైబడి, అర్హులైన ప్రతీ మహిళకు చీరలు అందించనున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?