NTV Telugu Site icon

Barrelakka: బర్రెలక్క గురుంచి సంచలన విషయాలు బయటపెట్టిన కన్నతండ్రి

Barelakka

Barelakka

Barrelakka:బర్రెలక్క.. బర్రెలక్క.. బర్రెలక్క.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఒక చిన్న వీడియోతో బర్రెలక్క అలియాస్ శిరీష అనే యువతీ సెన్సేషన్ సృష్టించింది. ఇక ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేసింది. ఎప్పుడైతే నామినేషన్ వేసిందో అప్పటినుంచి ఆమె గురించి తెలుసుకోవాలని ప్రజలు ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. ఇక శిరీష డిగ్రీ అగ్రికల్చర్ చదివి.. ఉద్యోగం కోసం ప్రయత్నించి.. ఉద్యోగం లేక బర్రెలను కాసుకుంటున్నట్లు ఆమె వీడియోలో తెలిపింది. ఇక గత కొన్నిరోజులుగా ఆమెపై, ఆమె తండ్రిపై దాడులు జరిగాయి. అయితే ఇదంతా నచ్చని ఆమె తండ్రి.. ఆమె గురించి అసలు సిసలైన నిజాలను ఒక వీడియో ద్వారా తెలిపాడు. అందుతున్న సమాచారం ప్రకారం.. శిరీషకు అతని తండ్రికి సత్సబంధాలు లేవని సమాచారం. ఇప్పటివరకు నా తండ్రి నన్ను వదిలేశాడు.. మా అమ్మనే కష్టపడి పెంచింది అని చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలకూ ఆమె తండ్రి ఫైర్ అయ్యాడు.

Barrelakka Special Interview: నన్ను లేపెయ్యాలని చూస్తున్నారు!.. బర్రెలక్కతో స్పెషల్‌ ఇంటర్వ్యూ

ఇక తాజాగా ఒక వీడియోలో బర్రెలక్క తండ్రి మాట్లాడుతూ.. ” కర్నే శిరీష పెళ్లి నేను ఎంతో ఘనంగా చేశాను.. ఆ ఊర్లో ఎవరు చేయనంత ఘనంగా హీరో .. కార్లు, ఫుడ్ అంతా నేనే దగ్గరుండి చూసుకున్నాను. మొగుడితో గొడవపడి ఇంటికి వచ్చి.. సిగ్గులేకుండా బర్రెలు కాసుకున్నావ్.. ఆ బర్రెలు ఎవరు ఇచ్చారు.. సిగ్గు సరం లేకుండా జనాలకు బర్రెలక్క అని చెప్తున్నావ్.. నీకెక్కడివి బర్రెలు. నేను కొన్నాను. ఇప్పుడు నేను కష్టపడ్డాను అని చెప్తున్నావ్.. ఇంత విషం పోసుకొని చావు. నిన్ను చదివించడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు.. పెళ్లి చేశా .. ఇల్లు కట్టా.. ఒక్క రూపాయి అప్పు లేకుండా నీ పెళ్లి చేసి పంపిస్తే.. నేను పెంచలేదని ఎలా చెప్తావ్. పని చేయడానికి.. ఇంటికి ఒక మహిళ వస్తే అనుమానిస్తావా..? అలాంటి పనులు చేస్తే.. రెండు ఇళ్లు ఎలా కట్టేవాడిని. నన్ను అందరిముందు ఇలా చేస్తావా.. ఇది నీ బాగోతం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.