NTV Telugu Site icon

Minister KTR: ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే అభివృద్దికి ఆమడదూరంలో ఉండేది కాని..

Minister Ktr

Minister Ktr

Minister KTR: ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే అభివృద్దికి ఆమడదూరంలో ఉండేది. కాని ఆదిలాబాద్ ను కూడా ఐటీ మ్యాప్ లో పెట్టిన సిఎం కేసీఆర్ విజన్ కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్‌. ఆదిలాబాద్ లోని BDNT LAB ను ఐటీ శాఖ మంత్రి సందర్శించారు. తెలంగాణ లోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమను విస్తరించాలన్నది తెలంగాణ ప్రభుత్వం విధానం ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో ఒక ఐటీ కంపెనీ రావడం చాలా సంతోషమన్నారు. NTT, BDNT LAB ను ఆదిలాబాద్ లో ఏర్పాటుచేసిన సంజయ్ దేశపాండే కు ధన్యవాదాలు తెలిపారు. సిఎం కేసీఆర్ దార్శనికతతో వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు అవకాశాలు కల్పిస్తే హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలతో పోటీ పడతారని అన్నారు.

Read also: Telugu Film Journalists: తెలుగు సినీ పాత్రికేయ చరిత్రను ఆవిష్కరించిన కృష్ణ, బ్రహ్మానందం

వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ లాంటి పట్టణాల్లో ఐటీ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. పట్టుదల ఉంటే ఎవరికీ తీసిపోకుండా విజయం సాధిస్తారన్నారు. NTT, BDNT LAB లో పనిచేస్తున్న వాళ్లంతా ఆదిలాబాద్ స్థానికులే అని గుర్తు చేసారు మంత్రి. ఇక్కడ ఉండే వీళ్లంతా అమెరికాతో పాటు ఎన్నో దేశాల అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం సంతోషమన్నారు. విద్యుత్ సరాఫరాను మరింత మెరుగురిచేందుకు డెడికేటెడ్ ట్రాన్స్ ఫార్మర్ కావాలన్నారు. తాత్కాలిక బిల్డింగ్ ఇది, దీన్ని ఇంకొంచెం ఆధునీకరించాలని ఉద్యోగులు కోరాడంతో.. కలెక్టర్, మున్సిపల్ ఛైర్మెన్ గారికి కోటిన్నర రూపాయలను సాయంత్రం వరకు మంజూరు చేయిస్తానని తెలిపారు మంత్రి కేటీఆర్‌. ఆధునీకరణ పనులను ప్రభుత్వ పరంగా ఉచితంగా చేయిస్తాం. ఇక్కడ కంపెనీ స్థాపించడమే ఈ యాజమాన్యం మనకు చేసిన అతి పెద్ద సహాయం అన్నారు.

Read also: Telugu Film Journalists: తెలుగు సినీ పాత్రికేయ చరిత్రను ఆవిష్కరించిన కృష్ణ, బ్రహ్మానందం

వీళ్లను చూసి మిగతా వారు రావాలన్నది ప్రభుత్వ ఆశ అని, కలెక్టర్ ఈ పనులు చేయిస్తారన్నా తెలిపారు. గతంలో ఆదిలాబాద్ లో సిసిఐ ఉండేది. దాన్ని తిరిగి తెరిపించేందుకు చాలా ప్రయత్నాలు చేసినం. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి కోరాము. కొత్త యూనిట్ పెడితే ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారో అవన్నీ ఇస్తాం అని కూడా చెప్పినం. రాష్ట్రంలో నిర్మాణ రంగం అద్భుతంగా పురోగమిస్తోంది. ప్రైవేటు కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నాయి. మరి ప్రభుత్వ సంస్థ ఎందుకు లాభం సంపాదించదు? రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే అది ఇవ్వడానికి సిద్దంగా ఉంది. జోగురామన్న నాయకత్వంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఉధ్యమం చేసింది. కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జోగురామన్న గారు ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని అడిగారు. ఆయన విజ్ఞప్తిమేరకు ఐదు ఎకరాల స్థలంలో ఐటీ పార్క్ కు త్వరలోనే శంఖుస్థాపన చేస్తామన్నారు. విదేశాల్లో ఉన్న పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూమి పుత్రులు కూడా ముందుకు రావాలి. అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. ఇక్కడ ఏర్పాటుచేయబోతున్న ఐటీ పార్క్ లో కంపెనీలు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Flexi Printers Association: ఫ్లెక్సీల నిషేధంపై ప్రభుత్వం పునరాలోచించాలి