NTV Telugu Site icon

Massage Centers: డాక్టరై హాస్పిటల్ పెట్టాలనుకుంది.. వ్యభిచారం కూపంలో అడ్డంగా దొరికింది

Spa Center

Spa Center

Massage Centers: హైదరాబాద్‌లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బంజారాహిల్స్‌లోని స్పా సెంటర్‌పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఓ అపార్ట్ మెంట్ లో నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించారు.ఈ క్రమంలో ఆదివారం రాత్రి మసాజ్ సెంటర్ పై దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడ వ్యభిచారం గుట్టు రట్టయింది. శృతి, రమణ, జహీద్ ఉల్ హక్ మసాజ్ సెంటర్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి క్రాస్ మసాజ్ చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. వీరితో పాటు మరో ముగ్గురు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. మసాజ్ సెంటర్‌లో పట్టుబడిన యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఈ స్పా సెంటర్ నిర్వాహకులపై గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కూడా దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రెండో సారి శృతి అరెస్ట్..

మెయిన్ ఆర్గనైజర్ శృతి డాక్టర్ కావాలనుకున్న శృతి ఆగడాలు దారి మళ్ళింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శృతి డాక్టర్ కావాలి అనుకుంది. ఉక్రెయిన్ లో మెడిసిన్ సీట్ సంపాదించింది. మొదటి సంవత్సరం పూర్తి చేసిన శృతి రెండవ సంవత్సరం ఫీజు చెల్లించలేక స్వస్థలం భద్రాచలంకు వచ్చింది. అనంతరం అమీర్పేట్ లో హెయిర్ హోస్టర్ గా శిక్షణ తీసుకుంది. అదే సమయంలో బంజర్ హిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్ గాను పనిచేసింది. డాక్టర్ గా ఎయిర్ హోస్టరుగా కన్న కలలు కాకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలి అనుకుంది. దీంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మసాజ్ సెంటర్ తెరిచింది. అమ్మాయిలను రప్పించి క్రాస్ మసాజ్ వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించింది శృతి. సమాచారం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు మసాజ్ సెంటర్ లో దాడులు చేసి నిందితురాలు శృతిని అదుపులో తీసుకుని జైలుకి పంపారు. జైల్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా శృతితో మార్పు రాలేదు. బంజారాహిల్స్ లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార రాకెట్ కు తెరలేపింది. దీంతో రెండోసారి శృతి పోలీసులకు చిక్కింది. శృతితో పాటు మరో ఇద్దరిని రిమాండ్ కు తరలించారు పోలీసులు.
MLA Jagga Reddy: ఈసారి కూడా అధికారంలోకి రాకపోతే.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Show comments