NTV Telugu Site icon

Bandi sanjay: కేసీఆర్‌ కొడుకు కాకపోతే కేటీఆర్ కు గుర్తింపు ఏదీ..!

Bandi Sanjay Ktr

Bandi Sanjay Ktr

Bandi sanjay: కేసీఆర్‌ కొడుకు కాకపోతే కేటీఆర్ కు గుర్తింపు ఏదీ..! అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ ప్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కరీంనగర్ జిల్లాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ది ఐరన్ లెగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ వచ్చి వెళ్ళగానే దొంగతనం జరిగిందని అన్నారు. కొండగట్టు కు పైసలు రాలేదని, దొంగలు వచ్చి పోయారని ఎద్దేవ చేశారు. దొంగతనానికి పాల్పిడిన వారిని పిచ్చోళ్ళుగా చిత్రికరించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని అన్నారు. పక్కన ల్యాండ్ లు కొన్నారు.. మీ కుటుంబ సభ్యులు ల్యాండ్ లు కొన్నారంటూ మండిపడ్డారు. అందుకే ఆలయ అభివృద్ధి అంటున్నారని ఆరోపించారు. అయినా సరే అభివృద్ధి జరిగితే మంచిదే అన్నారు. మీ నాన్న దేవుడిని నమ్మితే కేటీఆర్ నాస్తికుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మాన్ని హేళన చేయడంలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు పోటీ పడుతున్నాయన్నారు. మీ నాన్న తో నిఖార్సయిన హిందువుగా మార్చిన ఘనత మాదని తెలిపారు. అన్ని దేవుళ్ళను మొక్కుతాం కేటీఆర్‌ కు ఏం నొప్పి అంటూ నిప్పులు చెరిగారు. కేంద్రం ఏం ఇచ్చిందో చెప్పడానికి సిద్ధం అన్నావు అది కేటీఆర్ తో కాదని తెలిపారు. కేసీఆర్‌ కొడుకు కాకపోతే కేటీఆర్ కు గుర్తింపు ఏదీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయంలో చర్చకు రా? అన్నారు. లెక్కా పత్రం రెడీగా ఉందన్నారు. అవే అంశాలతో ఎన్నికలకు పోతామన్నారు. తెలంగాణ ద్రోహులే కేసీఆర్‌ కుటుంబ సభ్యులు అన్నారు.

Read also: Short Hair: మట్టికుస్తీ సినిమా సీన్ రిపీట్‌.. వధువు జుట్టు చూసి పెళ్లికి నో చెప్పిన వరుడు

ఇక మెడికో ప్రీతి ఘటనపై స్పందించారు. ప్రీతి లాగా చాలా మందిని దుండగులు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి చదివే పిల్లలను కోల్పోవడం బాధాకరమన్నారు. వేధింపులు చేసిన వారికి ప్రభుత్వానికి పోలీసులకి జాలి కలుగుతుందని అన్నారు. రాగింగ్ తో పాటు 100 శాతం లవ్ జిహాద్ కేసు నమోదవుతున్నాయని తెలిపారు. హిందూ అమ్మాయిలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇతర దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయని, టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ మాట్లాడితే మతం అంటున్నారని, నిందితున్ని కాపాడటం కోసమే చిన్న చిన్న నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని మండిపడ్డారు. దీన్ని బట్టి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంత క్రూరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రీతి విషయంలో స్పందించక పోవడం దారుణమని అన్నారు. మెడికో ఘటన విషయంలో సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని అన్నారు.
Marriage In Hospital: మండపానికి రాలేనిస్థితిలో పెళ్లి కూతురు.. ఆసుపత్రికే వెళ్లి తాళికట్టిన వరుడు