Revanth Reddy: కవిత పై బండి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం లో సరైనవి కావని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. డి.ఎస్ చేరిక అధిష్ఠానం పరిధిలో ఉందని అన్నారు. ఇప్పటికే రెండు సార్లు సోనియా ను కలిశారని అన్నారు. కొత్త చేరికలు త్వరలో ఉంటాయన్నారు. నాయకులు అభ్యంతరం పెట్టిన చేరికలు అపొద్దు అని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. పార్టీ మేలు జరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేర్చుకుంటామన్నారు. ఉత్తర తెలంగాణ పై ఫోకస్ పెట్టామన్నారు రేవంత్. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. భట్టి యాత్ర ఏఐసీసి కార్యక్రమం కావున నేను హాజరవుతానని అన్నారు. కవిత పై బండి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం లో సరైనవి కావన్నారు. బీజేపీ బి.ఆర్.ఎస్ వ్యూహాత్మకంగా రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఫామ్ హౌజ్ పై డ్రోన్ ఎగురవేశానని దేశ ద్రోహులను పెట్టిన జైలు లో నన్ను వేశారని గుర్తు చేశారు. కేసీఆర్ అవినీతిలో బీజేపీ చెస్తూన్న ఆరోపణలు 1 శాతం మాత్రమే అన్నారు. టి.ఆర్.ఎస్ పార్టీ కి 1000 కోట్ల నిధులు వచ్చాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పడం లేదన్నారు. 100 కోట్ల కోసం రాద్దాంతం చేస్తున్న బీజేపీ నేతలు 1000 కోట్ల నిధుల పై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీజేపీ బి.ఆర్.ఎస్. ది వీధి నాటకం ఓట్ల కోసం పాము ముంగిస ఆట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Daughter harsh: సమాజం ఎటుపోతోంది.. తండ్రి ఇంట్లో ఉండగానే ఇంటికి నిప్పుపెట్టిన కన్న కూతురు..
అయితే తాజాగా బండి సంజయ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై స్పందించారు. రాష్ట్ర ప్రజల కోసమే కవిత అక్రమ మద్యం డీల్‌కు పాల్పడ్డారా? అని ప్రశ్నించారు బండి సంజయ్. వాళ్లు అక్రమంగా సంపాదించిన డబ్బును పంట రుణాల మాఫీకి ఖర్చు చేస్తున్నారా? లేదా ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ఉపయోగిస్తున్నారా? లేదా నిరుద్యోగ భృతికి ఖర్చు చేస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు బండి. ఇక ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వికెట్ పడిపోయిందని అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు బండిసంజయ్. అంతేకాకుండా.. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. కాగా.. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలపై రేవంత్ స్పందించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.