NTV Telugu Site icon

Bandi Sanjay: రేపు వరంగల్ కు మోడీ.. అందరూ వచ్చి సభ సక్సెస్ చేయండి

Bandi Sanjay Karimnagar

Bandi Sanjay Karimnagar

Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపు ప్రధాని మోడీ వరంగల్ వస్తున్నారని అందరూ వచ్చి సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగితా సమయంలో మోడిది అభివృద్ధి మంత్రమే అన్నారు. రైల్వే వ్యాగన్ మ్యాన్ ఫాక్చర్ యూనిట్, జాతీయ రహాదారులని ప్రారంభిస్తారని అన్నారు. అభివృద్ధి కొరకు రోడ్ల విస్తరణకి సహాకరించిన వారికి ధన్యవాదాలన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ రైల్వే ఆర్వోబి పనుల కొసం వందశాతం నిధులు కేంద్రం కేటాయించిందని తెలిపారు. రేపటి మోడి బహిరంగ సభకి అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కరీంనగర్ జిల్లా కారాగారంలో గజ్వేల్ బీజేపీ కార్యకర్తలను బండి సంజయ్ పరామర్శించారు. కార్యకర్తలను కలిసి జైలు నుంచి బయటికి వచిన సంజయ్ మాట్లాడుతూ.. గజ్వేల్ గొడవల కేసుతో కరీంనగర్ జైలులో ఉన్న 11 మంది నిందితులు కలిసానని అన్నారు. సీఎం నియోజకవర్గం గజ్వేల్ లో శివాజీ విగ్రహం దగ్గర జరిగిన ఘటన అందరికి తెలుసు అని అన్నారు. ఈ ఘటనని నేను సమర్థిస్తున్న ..శివాజీ విగ్రహానికి అవమానం జరిగితే చూస్తూ ఉరుకోమన్నారు.

Read also: Falaknuma Express: ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 5 బోగీలు పూర్తిగా దగ్ధం..

శివాజీ విగ్రహం దగ్గర మూత్రం పోస్తే లిక్కర్ బాటిల్ ఇస్తాం అంటూ బెట్టింగ్ కట్టారు కొందరు అని మండిపడ్డారు. అది తప్పు కాదా ? అని ప్రశ్నించారు. ఇక్కడ పార్టీలకి సంబంధం లేకుండా వ్యతిరేకించాల్సిన అంశం అని తెలిపారు. ఇంత చేసినవారిని పోలీసులు అరెస్ట్ చేయలేదు కానీ వీడియో తీసిన వారిని అరెస్ట్ చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కార్యకర్తలపై సోడా బాటిల్స్ , బీర్ బాటిల్స్ తో దాడి చేసారని మండిపడ్డారు. ఒక కౌన్సిలర్ ఈ గొడవ ఆపే ప్రయత్నం చేసారని ఆరోపించారు. ఇక్కడ ఫిర్యాదు చేసినవారిపై, గొడవ ఆపేందుకు వెళ్లిన వారిపై కూడా పోలీసులు రివర్స్ కేసులు పెట్టారని మండిపడ్డారు. మసీద్ నుండి రెచ్చగొట్టి గొడవ చేసిన 30 మందిలో కేవలం ఆరుగురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ విగ్రహానికి అవమానం జరిగితే చూస్తూ ఊరుకునే స్థితిలో మేము లేమని అన్నారు. ఈ కేసులో అమాయకులపై నాన్ బేయిలబుల్ పెట్టాలని CMO నుండి పోలిసులపై ఒత్తిడి ఉందని అన్నారు. సీఎం నియోజకవర్గంలోనే శివాజీ విగ్రహానికి అవమానము జరిగింది. కేసీఆర్ ఈ విషయంపై స్పందించాలన్నారు.
Tomato Price: టమాటాకు రికార్డ్ ధర.. కిలోకి రూ. 250